ఆంధ్రప్రదేశ్‌

టీడీపీకి మాజీ ఎంపీ హర్షకుమార్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 21: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన హర్షకుమార్‌కు అమలాపురం సీటు లభించకపోవడంతో గురువారం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా కాతేరులో విలేఖరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్‌పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు పథకం ప్రకారం ఈ పార్టీలు కొంతమంది డమీలను పోటీలో నిలిపాయన్నారు. నాగబాబుకు నర్సాపురం సీటును కేటాయించడమే జనసేన, టీడీపీ కుమ్మక్కుకు నిదర్శనమన్నారు. టీడీపీ కండువా తనకు బరువుగా ఉందని, కండువాను దించేస్తున్నట్టు ప్రకటించారు. ఈఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వనన్నారు. 2024నాటికి కొత్త పార్టీని ప్రారంభించనున్నట్టు చెప్పారు. తనకు అమలాపురం టీడీపీ టిక్కెట్ లభించకపోవడానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీయే కారణమన్నారు. వైఎస్సార్‌సీపీ, జనసేన పార్టీలను అభిమానించినా తనను ఆపార్టీలు ఆదరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలు బూటకమన్నారు.