ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీని గుప్పిట్లోకి తెచ్చుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక విశాఖ, మార్చి 21: రాజకీయంగా రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చేందుకు జనసేన కృషి చేసి అసెంబ్లీని జనసేన గుప్పిట్లోకి తెచ్చుకుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో గురువారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పారిపోయే వారు కాకుండా నిలబడి ఎదుర్కొనే దమ్మున్న అభ్యర్థులను జనసేన పోటీలోకి దించిందన్నారు. 25 కేజీల బియ్యం కోసం జనసేన పోరాటం చేయడం లేదని, నిరుద్యోగులకు 25 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని అందించేందుకు రాజకీయాల్లోకి వచ్చిందన్నారు. నటనా జీవితానికి ఓనమాలు దిద్దిన విశాఖపట్నం నుండే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని అన్నారు. గాజువాక నియోజవర్గం నుండి జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానన్నారు. నటుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు విశాఖపట్నంలోనే ఓనమాలు దిద్దానన్నారు. నటనా జీవితానికి అందాల విశాఖ తొలి మెట్టు అయినట్టే రాజకీయ జీవితానికి కూడా తొలి మెట్టు కావడం సంతోషం కలిగించిందన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయం చేయడం రాదని చెబుతున్న నేతలు ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా? అని ప్రశ్నించారు. మోదీ అంటే వైసీపీ అధినేత జగన్ వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తే మోదీ జగన్‌పై కేసులు బయటపెడతారన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి ఏ ప్రయోజనం ఆశించి మద్దతు పలికామో అది నెరవేరలేదన్నారు. రాజకీయ దోపిడీని అడ్డుకునేందుకు రాజకీయాలను ఎంచుకున్నానన్నారు. జనసేన 130 అసెంబ్లీ స్థానాలు, 18 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిందన్నారు. రౌడీ మూకలు, భూకబ్జాదారులకు జనసేనలో చోటులేదన్నారు. యువకులు 2000 రూపాయలు కోరుకోలేదని, 25 ఏళ్ల ఉపాధి జీవితాన్ని అందించాలని కోరుతున్నారన్నారు. దీనికి కట్టుబడి జనసేన పని చేస్తుందన్నారు. అందాల విశాఖను రౌడీ మూకలు చిన్నాభిన్నం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. సభలో జిల్లావ్యాప్తంగా ఉన్న జనసేన అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి అనంతరం తను పరిచయం చేసుకున్నారు. ఈ ప్రాంతంలోనే తిరుగుతూ విద్యను పూర్తి చేసుకుని నటనా జీవితానికి పునాది రాయి వేసిన ఒక వ్యక్తి గాజువాక నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. సమావేశంలో లక్ష్మీనారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ, చింతలపూడి వెంకటరామయ్య, రఘు, శివశంకర్, కోన తాతారావు, బొగ్గు శ్రీనివాసరావు, పసుపులేటి ఉషారాణి, క్రికెటర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రాలు.. గాజువాక బహిరంగ సభలో మాట్లాడుతున్న జనసే అధినేత పవన్ కళ్యాణ్