ఆంధ్రప్రదేశ్‌

తండ్రీకొడుకుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకల్లు, జూలై 28: అనంతపురం జిల్లాలో గురువారం సంచారజాతి వారి మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ రెండు ప్రాణాలను బలిగొంది. డబ్బు విషయమై మాటామాటా పెరగడంతో తండ్రీకొడుకులు గుర్రప్ప, కొట్రసిని చావగొట్టారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం కాశీపురానికి చెందిన కొంతమంది సంచారజాతి వారు కొక్కంటి క్రాస్ వద్ద గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. గురువారం మద్యం మత్తులో రమేష్ కుమారులు గుర్రప్ప(70), అతని కొడుకు కొట్రసి(27)తో గొడవపడ్డారు. మాటామాట పెరగడంతో కత్తులతో గుర్రప్ప, కొట్రసిపై దాడి చేయడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. రమేష్, నటరాజ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.