ఆంధ్రప్రదేశ్‌

బాబు కోసం చండీయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చి, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో గురువారం నగరంలో చండీయాగం జరిగింది. ఈ యాగంలో బుద్దా వెంకన్న, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేశారని, అటువంటి నేత నిండు నూరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. అందుకే చంద్రబాబుకు మంచి జరగాలనే ఈ చండీ యాగం చేపట్టామన్నారు. తనకు, తన కుటుంబానికి చంద్రబాబు దైవంతో సమానమన్నారు. తమ దైవం ఆయురారోగ్యాలతో మంచిగా ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని, చంద్రబాబు పని తీరు మెచ్చి మళ్లీ గెలిపించాలని ప్రజలే స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు.