ఆంధ్రప్రదేశ్‌

పులివెందుల బిడ్డగా గర్విస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మార్చి 22: పులివెందుల గడ్డపై పుట్టినందుకు చాలా గర్వపడుతున్నానని, కష్టాల్లో ధైర్యాన్ని, సహనాన్ని, మంచిని, చిరు నవ్వును నేర్పింది ఈ గడ్డేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పులివెందుల సీఎస్‌ఐ చర్చి ఆవరణలో నిర్వహించిన ఎన్నికల సభలో జగన్ మాట్లాడుతూ పులివెందుల అభివృద్ధి జరిగింది వైఎస్సార్ హయాంలోనేనన్నారు. పులివెందులకు జేఎన్‌టీయూ, ట్రిపుల్ ఐటీ, ఐజీకార్ల్, గండి క్షేత్రం అభివృద్ధి, కడప నుంచి పులివెందులకు నాలుగురోడ్ల రహదారి, పులివెందుల చుట్టూ రింగ్‌రోడ్డు, పైడిపాళెం తదితర ఎన్నో అభివృద్ధిపనులు ఆయన హయాంలోనే జరిగాయన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంకు ఏమీ చేయని బాబు పులివెందులలో అభివృద్ధి చేశానని అబద్ధాలు చెబుతున్నాడన్నారు. కడప జిల్లాలో గెలవలేమని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్ వస్తుంది, ఉద్యోగాలొస్తాయని యువత ఎంతగానో ఎదురుచూశారన్నారు. అయితే బాబు దాన్ని నీరుగార్చారన్నారు. ఐదేళ్ల పాలనలో పెండింగ్ పనుల్లో పది శాతం కూడా పూర్తిచేయలేకపోయారన్నారు. నీరు అందుబాటులో ఉంటే బంగారం పండించే పద్ధతి మనకు తెలుసునన్నారు. బాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతాడని ఎద్దేవా చేశారు. అభ్యర్థులు, డబ్బు పవన్‌కు బాగా ముట్టజెప్పారని ఆరోపించారు. చిన్నాన్నను చంపించింది వారే, అయితే నిందలు తమ కుటుంబంపై వేస్తున్నారని జగన్ ఆరోపించారు. పులివెందుల అంటే తమ కుటుంబానికి ఎంతో ప్రేమ అని అన్నారు. నాన్నను, చిన్నాన్నను, అమ్మను దీవించినట్టే తనను దీవించాలని జగన్ ఓటర్లను అభ్యర్థించారు. మీ దీవెనలు, ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్.అవినాష్‌రెడ్డి, వైఎస్.మనోహర్‌రెడ్డి, వైఎస్.ప్రమీలమ్మ, వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.