ఆంధ్రప్రదేశ్‌

జగన్‌తో పోలుస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మార్చి 22: అవినీతిపరుడు, నేర చరిత్ర కలిగిన జగన్‌తో తనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోల్చడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి, టీడీపీకి సమాన దూరం పాటిస్తానని పవన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు పైవిధంగా స్పందించారు. తన గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు. రాజకీయాలు చేస్తే బాధ లేదని, తన కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడితే బాధ కలుగుతుందన్నారు. జగన్ గురించి మీ పార్టీలో ఉన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణను అడిగితే నేరాల చిట్టా వివరిస్తారన్నారు. గజదొంగ, నేర చరిత్ర కలిగిన జగన్‌తో తనను పోల్చి మాట్లాడడం పవన్‌కు సరికాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మన రాష్ట్రంపై పెత్తనం చేయాలని చూస్తున్నాడన్నారు. సీమకు, విశాఖకు నీళ్ళు రాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారన్నారు. వీటిపై ప్రశ్నించే సత్తా జగన్మోహన్‌రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ప్రస్తుత ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలుగా చంద్రబాబు పేర్కొన్నారు. మరో ఐదేళ్ళు అధికారం అప్పగిస్తే వినూత్న ఆలోచనలతో మరింత ముందుకు పోతామన్నారు. తన సంకల్పం విశాఖ ఉక్కుకంటే గట్టిగా ఉంటుందన్నారు. ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేసారు. మీ భవిష్యత్ తన బాధ్యతగా పేర్కొంటూ ఎన్నికల్లో టీడీపీకి ఘన విజయం సాధించి పెట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా ఈ మూడు జిల్లాల్లో ప్రతీ ఎకరానికి గోదావరి జల్లాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందు కోసం 7,200 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. రైతులు ముఖంలో ఆనందం చూడడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. విశాఖ జిల్లాకు 1.50 లక్షల సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే విశాఖ నగరానికి సాగునీరు అందుతుందన్నారు. హుద్‌హుద్ తుఫాన్‌లో పూర్తిగా నష్టపోయిన విశాఖను అనతి కాలంలోనే పునరుద్దరించడం జరిగిందన్నారు. అన్న క్యాంటీన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రూపాయలకే భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ సభలో మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.