ఆంధ్రప్రదేశ్‌

ఉభయగోదావరి జిల్లాల్లో ఉత్సాహంగా ఐదో రోజు నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 22: ఉభయ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఒక వైపు పోలింగ్ జోరుగా సాగితే, మరో వైపు నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 20 మంది అభ్యర్ధులు మొత్తం 29 సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 102 మంది అభ్యర్ధులు మొత్తం 142 సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత ఐదవ రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
ఎమ్మెల్సీ పోలింగ్ నేపధ్యంలో ఆయా పార్టీ అభ్యర్ధులు ఎటువంటి హడావిడి లేకుండా సాధారణ వాతావరణంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. ముహూర్త బలాన్ని బట్టి ఇప్పటి వరకు కంటే శుక్రవారం నామినేషన్లు అత్యధికంగా దాఖలయ్యాయి. రాజమహేంద్రవరం సిటీ టీడీపీ అభ్యర్ధి ఆదిరెడ్డి భవాని, వైసీపీ అభ్యర్ధి రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధి కందుల లక్ష్మీ దుర్గేష్ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఆకుల శ్రీ్ధర్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాయుడు రాజవల్లీ నామినేషన్ దాఖలు చేశారు. అమలాపురం పార్లమెంట్‌కు జనసేన అభ్యర్ధి డిఎం ఆర్ శేఖర్, రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన అభ్యర్ధి డాక్టర్ ఆకుల సత్యనారాయణ నామినేషన్లు దాఖలు చేశారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి వైకాపా అభ్యర్ధిగా కురసాల కన్నబాబు, పిఠాపురం వైసీపీ అభ్యర్ధి పెండెం దొరబాబు, టీడీపీ అభ్యర్ధి ఎస్వీఎస్ వర్మ, సీపీఐ ఎంఎల్ నుంచి పిల్లా చంద్రం నామినేషన్లు దాఖలు చేశారు.
పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో గుడా ఛైర్మన్ గన్నికృష్ణ పాల్గొన్నారు. రాజానగరం నుంచి మళ్ళీ పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నామినేషన్ దాఖలు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి లూథిర్, పిరమిడ్ పార్టీ నుంచి సీతరాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. వీరబాబు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు చేశారు. కొత్తపేటలో టీడీపీ అభ్యర్ధి బండారు సత్యానందరావు నామినేషన్‌ను ఊరేగింపుగా వచ్చి దాఖలు చేశారు. ముమ్మిడివరం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్ధి దాట్ల బుచ్చిరాజు తన అనుచరులతో, కార్యకర్తలతో భారీ స్థాయిలో వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్వీ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి సత్యగోపీనాధ్ దాస్ నామినేషన్ దాఖలు చేశారు. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి మరోతి శివ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. జగ్గంపేట అసెంబ్లీకి బీజేపీ అభ్యర్ధి వత్సవాయి సూర్యనారాయణ రాజు నామినేషన్ దాఖలు చేశారు. మండపేట అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్ధి వేగుళ్ళ లీలాకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కామన ప్రభాకరరావు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్ధి కె సత్యనారాయణ నామినేషన్ వేశారు.
రామచంద్రపురం నుంచి పిరమిడ్ పార్టీ తరపున పి హిమబందర రావు నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్ధిగా ఎర్రంశెట్టి వీరవెంకట సత్యనారాయణ రామరాజు నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి దూడల శంక నారాయణమూర్తి నామినేషన్ వేశారు.
ప.గో. జిల్లాలో
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ మాగంటి బాబు, జనసేన అభ్యర్థిగా పెంటపాటి పుల్లారావు నామినేషన్ దాఖలు చేశారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా వేటుకూరి శివరామరాజు నామినేషన్ వేశారు. అదే పార్లమెంటు నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పైడి కొండల మాణిక్యాలరావు నామినేషన్ వేశారు. ప్రజాశాంతి పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా కిలార్ ఆనంద్ నామినేషన్ వేశారు.
స్వతంత్ర అభ్యర్థులుగా మేడపాటి వరహాలరెడ్డి, గొట్టుముక్కల శివాజీ నామినేషన్లు వేశారు. నరసాపురం అసెంబ్లీ టీడీపీ నియోజకవర్గానికి బండారు మాధవనాయుడు, జనసేన పార్టీ అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్, బీజేపీ అభ్యర్థిగా పులపర్తి వెంకటేశ్వరరావు నామినేషన్లు దాఖలు చేశారు. కొవ్వూరు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా బూసి సురేంద్రనాథ్ బెనర్జీ నామినేషన్ వేశారు. ఉండి వైసీపీ అభ్యర్థిగా పివిఎల్ నరసింహరాజు నామినేషన్ వేశారు. ఉండి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మంతెన రామరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఆచంట అసెంబ్లీ అభ్యర్థిగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు నామినేషన్ వేశారు. గోపాలపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైసీపీ అభ్యర్థిగా తలారి వెంకట్రావు నామినేషన్లు వేశారు.