ఆంధ్రప్రదేశ్‌

మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 22: మూడు దశాబ్దాలకు పైగా మంగళగిరి నియోజకవర్గంలో ఎగరని తెలుగుదేశం జెండాను ప్రజలందరి అండతో ఈ ఎన్నికల్లో విజయం సాధించి పసుపుజెండా ఎగరవేస్తానని రాష్టమ్రంత్రి, టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ప్రకటించారు. శుక్రవారం మంగళగిరి తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం లోకేష్ విలేఖర్లతో మాట్లాడుతూ ఏపీలో జీరోగా ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను తాను ఐటీ మంత్రిగా వచ్చాక సాటిలేని మేటిగా తీర్చిదిద్దానని, మంగళగిరికి చాలా ఐటీ కంపెనీలు తెచ్చేందుకు కృషి చేశానని, మరిన్ని కంపెనీలు తెస్తానన్నారు. అరకు కాఫీకి ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన మాదిరిగా మంగళగిరి చేనేత వస్త్రాలకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చి మార్కెటింగ్ అవకాశాలు పెంపొందిస్తామని, నియోజకవర్గంలో ఎక్కువమంది రైతులు పండిస్తున్న పసుపును కూడా గ్రేడింగ్ చేసి ఎగుమతులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అందరు ఇళ్లు కోరుతున్నారని, ఇక్కడ ఉన్న భూమి సమస్యను అధిగమించేందుకు టీడీపీ అధికారంలోకి రాగానే భూ సమీకరణ చేపట్టి అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.
సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఎమ్మెల్యేగా ఆర్కేని గెలిపించుకుంటే కనీసం తమ మొఖం చూడలేదని ప్రజలు చెబుతున్నారని, కోర్టుల చుట్టూ తిరిగేందుకే ఆయనకు సమయం చాలకపోతే ఇక ప్రజలను ఎలా పట్టించుకుంటారని లోకేష్ ప్రశ్నించారు. అందరివాడిగా అందరికీ అందుబాటులో ఉంటానని, ఎవరు ఏ సమస్యతో వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టంచేశారు.