ఆంధ్రప్రదేశ్‌

మైనర్ రేప్ కేసులో ఇద్దరిపై నిర్భయ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 28: చిత్తూరు నగరం ఇరువారం సమీపంలో ఈనెల 23వ తేదిన మైనర్ బాలికపై రేప్ కేసులో ఇద్దరు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చిత్తూరు డి ఎస్పీ లక్ష్మీనాయుడు తెలిపారు. డి ఎస్పీ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఇరువారం ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక గత శనివారం రాత్రి గ్రామ సమీపంలోని అంగడి నుంచి సరుకులు తీసుకొని ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో యాదమరి మండలం మాధవరం హరిజనవాడకు చెందిన ఎం ఎస్ హరీష్ కుమార్‌తో పాటు మరో మైనర్ బాలుడు ఆ బాలికను అటకాయించి అరవకుండా నోరుమూసి వేసి గ్రామ సమీపంలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులిద్దరు వారు వినియోగించిన నిరోద్‌లను అక్కడే పారవేసి పారిపోయారు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులను గురువారం ఉదయం ఇరువారం చెక్‌పోస్టు వద్ద అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద ఉన్న ఓ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డి ఎస్పీ తెలిపారు. అయితే ఈ ఘటనలో ఓ మైనర్ బాలుడు ఉన్న నేపథ్యంలో అతనిని తిరుపతి జువనైల్‌హోమ్‌కు తరలించి హరీష్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు డి ఎస్పీ చెప్పారు.