ఆంధ్రప్రదేశ్‌

భీమవరం నుంచే రాజకీయ ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 22: రెండోబార్డోలిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచే రాజకీయ ప్రక్షాళన ప్రారంభిస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత మార్పు కోరుకుంటోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రెండో అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేయడానికి శుక్రవారం వచ్చిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్ అనంతరం భీమవరంలో ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఒక పక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై యుద్ధం ప్రకటించినట్లు జగన్‌పై ఘాటుగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటైన వ్యాఖ్యలు చేయలేదు. టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసిపోయాయని ఆయన అన్నారు.
టీఆర్‌ఎస్‌కు దమ్ముంటే ఈ రాష్ట్రంలో పోటీ చేయాలని, కావాలంటే భీమవరం నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉన్న గ్రంధి శ్రీనివాస్‌నే టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా పెట్టుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన చలసాని శ్రీనివాసయాదవ్ ఈ రాష్ట్రానికి వచ్చి రాజకీయం చేయవచ్చుకానీ ఈ రాష్ట్రానికి చెందిన తాము తెలంగాణాకు వచ్చి రాజకీయం చేయకూడదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రుల ఆస్తులకు తానే కాపలాదారుడినని మీరు ఏం చేస్తారో చూస్తానన్నారు.
2019లో రాజకీయ వ్యవస్థ మారాలని అంటూనే సీఎం చంద్రబాబు నాయుడుకు వయస్సు పెరగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డిలా తన దగ్గర నవరత్నాలు లేవని పీకె వెల్లడించారు. తన తాత పోస్ట్‌మ్యాన్ మాత్రమేనని తన తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అని అన్నారు. భీమవరంలో ఎమ్మెల్యేగా అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు. భీమవరం అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడ నుంచే ఉచిత విద్యను ప్రారంభిస్తానన్నారు. అదే విధంగా ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రకటించారు. భీమవరంలోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేస్తానని చెబుతూ ఆ విగ్రహానికి జనసేన పార్టీ తరుపున రూ.కోటి విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. భీమవరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని, ఆక్వా వల్ల ఈ ప్రాంతం కాలుష్యం అవుతోందని అందుకోసం విజ్జేశ్వరం నుంచి పైపు లైను ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఆరుమాసాల్లోనే కృషి చేస్తానని అన్నారు. భీమవరం యనమదుర్రు ప్రక్షాళన, డంపింగ్ యార్డు సమస్యలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ అభ్యర్ధి కొణిదెల నాగేంద్రబాబు ప్రసంగించారు. జనసేన పార్టీ అభ్యర్ధులు ఈ ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొన్నారు.