ఆంధ్రప్రదేశ్‌

సీపీఎం అసెంబ్లీ ఎన్నికల ప్రణాళిక విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 22: రెండు పార్టీల గుత్త్ధాపత్యాన్ని బద్దలు కొట్టండంటూ పిలుపునిచ్చిన సీపీఎం రాష్ట్ర కమిటీ ‘మార్పు కోసం - మంచి పాలన కోసం’ అంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం మధు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పాలకులు మేనిఫెస్టో హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. తెలుగు ప్రజలకు తీరని ద్రోహం చేసిన ఆ రెండు పార్టీలతోపాటు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ మోసాలకు చరమగీతం పాడాలని, ప్రజానుకూల విధానాలతో వస్తున్న సీపీఎం, సీపీఐ, జనసేన, బీఎస్‌పీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపుఇచ్చారు. ప్రత్యేక హోదా - విభజన హామీల అమలు, సాగునీటి ప్రాజెక్టులు, శ్రమకు తగ్గ ఫలితం, వ్యవసాయ రంగ పరిరక్షణ - రైతులు, కూలీల సంక్షేమం, కార్మిక హక్కులు, సీపీఎస్ రద్దు, సంక్షేమ కార్యక్రమాల అమలు, భూమి లేని వారికి భూ కేటాయింపు, నిర్వాసితులకు సంపూర్ణ పునరావాసం, కుల వివక్ష రూపుమాపేందుకు సామాజిక న్యాయం, ఉద్యోగ భర్తీ, గిరిజన సంక్షేమం, చేతి వృత్తులకు రక్షణ, కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు రూ. 2 లక్షలు, పుట్టిన ప్రతి బాలిక పేర లక్ష రూపాయల డిపాజిట్, ధరల నియంత్రణ, యువతకు ఉపాధి, 5వేల నిరుద్యోగ భృతి, ప్రభుత్వ రంగంలో విద్యకు అధిక నిధులు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ, మెరుగైన వైద్యం, హక్కుగా అందరికీ ఉచితంగా మంచినీరు, విభిన్న ప్రతిభావంతులకు గౌరవప్రదమైన జీవితం, మహిళా హక్కులు, చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు, డ్వాక్రా సభ్యులకు రుణమాఫీ, ప్రోత్సాహక పథకాలు, మున్సిపల్, పంచాయితీల ఆమోదంతో మద్య నియంత్రణ, బాలల హక్కులు, మైనార్టీలకు రక్షణ, అభివృద్ధి వికేంద్రీకరణ, అవినీతి నిర్మూలన - సుపరిపాలన, ఎన్నికల సంస్కరణలు మొత్తం 25 అంశాలతో కూడిన అంశాలతో మేనిఫెస్టోను రూపొందించామని, రెండు పార్టీల ఆధిపత్యానికి చెక్ పెట్టి సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమని మధు పేర్కొన్నారు.