ఆంధ్రప్రదేశ్‌

జగన్ ఆస్తులు రూ.376 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 22: కడప జిల్లా పులివెందుల శాసనసభ స్థానం నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తన ఆస్తులు, అప్పులు, కుటుంబసభ్యుల ఆస్తులు, కేసుల వివరాలను అఫిడవిట్‌లో సమర్పించారు. నామినేషన్ పత్రాలతో పాటు జతచేసిన అఫిడవిట్‌లో తన భార్య భారతి, కుమార్తెలు హర్షితారెడ్డి, వర్షారెడ్డి పేర ఉన్న స్థిర, చరాస్తులను కనబరిచారు. 2013-14 నుంచి 2017-18 వరకు ఐదేళ్లలో చెల్లించిన ఇన్‌కంటాక్స్ రిటర్న్ వివరాలను కూడా పొందుపరిచారు.
మొత్తం ఆస్తి రూ.376 కోట్లుగా చూపించారు. భార్య భారతిరెడ్డి పేర రూ.140 కోట్ల ఆస్తులున్నట్లు కనబరిచారు. తనకు సొంత వాహనం లేదని, 31 కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు)లో రూ. 20,20,083 డిపాజిట్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్)లో రూ. 21,44, 746 డిపాజిట్, హైదరాబాద్‌లోని మల్కాజిగిరి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సేవింగ్ ఖాతాలో రూ.25 వేలు డిపాజిట్ ఉన్నట్లు కనబరిచారు. చేతిలో రూ.43,560 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య భారతిరెడ్డి పేర యాక్సిస్ బ్యాంక్(బెంగళూరు)లో రూ.9,69,686 డిపాజిట్, ఇదే బ్యాంకులో మరో ఖాతాలో రూ.17,41,087, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(బెంగళూరు)లో రూ.5,73,701లు డిపాజిట్, అదే బ్యాంకులో మరో డిపాజిట్ రూ.20,90,821, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (హైదరాబాద్)లో రూ.8,09,824 డిపాజిట్, పులివెందుల ఎస్‌బీఐలో రూ.21,37,480 డిపాజిట్, యాక్సిస్ బ్యాంకు ట్రావెల్‌కార్డులో రూ.1,09,500 ఉన్నట్లు కనబరిచారు. భారతిరెడ్డి చేతిలో రూ.49,390 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ కంపెనీల్లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో తన పేర రూ.339,89,43,352 పెట్టుబడులు ఉన్నట్లు కనబరిచారు. వైఎస్ భారతిరెడ్డి పేర వివిధ కంపెనీల్లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో రూ.92,53,49,352 పెట్టుబడులు ఉన్నట్లు తెలియబరిచారు. ఈ పెట్టుబడులు భారతీ సిమెంట్ కార్పొరేషన్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, హరీష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సండూరు పవర్ కంపెనీ ప్రై లిమిటెడ్, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ బిల్డర్స్ ప్రై లిమిటెడ్ కంపెనీల్లో, యాక్సిస్ లిక్విడ్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ లిక్విడ్ ఫండ్, ఎస్‌బీఐ లిక్విడ్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంప్లటన్ లిక్విడ్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, టాటా లిక్విడ్ ఫండ్ కంపెనీల్లో ఉన్నట్లుగా కనబరిచారు.
కుమార్తెలు వైఎస్ హర్షిణిరెడ్డి పేర రూ.1,18,11,358 మ్యూచువల్‌ఫండ్స్ రూపంలో, వైఎస్ వర్షారెడ్డి పేర రూ.24,27,058 మ్యూచువల్ ఫండ్స్ రూపంలో వివిధ కంపెనీల్లో పెట్టుబడి చూపించారు. కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ లో 42.44 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేర ఉన్నట్లు కనబరిచారు. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.42,44,000గా చూపించారు. కర్నాటకలోని షిమోగా జిల్లాలో 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కనబరిచారు. వ్యవసాయేతర స్థలాల్లో పులివెందుల పట్టణంలో రూ.8,42,39,232 విలువ గల స్థలాలు, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి గిఫ్ట్‌గా సంక్రమించిన కమర్షియల్ బిల్డింగ్ విలువ రూ.14,46,33,560గా కనబరిచారు. ఇవి కాకుండా పులివెందుల పట్టణం, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం-2లో నివాస భవనాల మార్కెట్ విలువ రూ.11,99,59,582గా కనబరిచారు.
తన భార్య వైఎస్ భారతిరెడ్డి పేర కర్నాటకలోని షిమోగ జిల్లా, ఉడిపి జిల్లా, కడప జిల్లా పులివెందుల మండలంలో రూ.26.65 లక్షల విలువ చేసే వ్యవసాయ భూమి ఉన్నట్లు కనబరిచారు. ఆమె పేర రూ. 31,32,37,925 విలువ చేసే వ్యవసాయేతర భూములు ఉన్నట్లు కనబరిచారు. భార్య భారతిరెడ్డి, ఇద్దరు పిల్లలకు సంబంధించి రూ.9,85,76,500 విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో తన తండ్రి నుంచి గిఫ్టుగా వచ్చిన ఆస్తులు, ఆ తర్వాత కొన్న ఆస్తులు కూడా ఉన్నాయి. తనకు, తన భార్య భారతిరెడ్డికి ఎలాంటి వాహనాలు లేవని అఫిడవిట్‌లో కనబరిచారు. వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు రూ.1,19,21,202గా అఫిడవిట్‌లో కనబరిచారు. అదేవిధంగా ప్రభుత్వం డ్యూస్ రూ.63,43,55,619 ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల కేసులు 31, వివిధ ప్రాంతాలు వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నట్లు జగన్ తన అఫిడవిట్‌లో వివరించారు.