ఆంధ్రప్రదేశ్‌

రెవెన్యూలో మరిన్ని సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: రెండేళ్లుగా రాష్ట్రం పట్టాదారు వివరాలు రెవెన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. అంతేకాకుండా పంటల వివరాలను టాబ్‌ల ద్వారా నమోదు చేసిన మొదటి రాష్ట్రంగా, ప్రతి భూమిని జాయోటాగింగ్ చేసిన రాష్ట్రంగా పేరు పొందినట్టు చెప్పారు. రాష్ట్రంలో భూ రికార్డుల వివరాలను, బ్యాంకుల్లో అనుసంధానించిన మొదటి రాష్ట్రంగా ఏపి అని, అదే విధంగా ఎలక్ట్రానిక్ 1బితో రుణాలు మంజూరు, రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించిన రాష్ట్రంగా దేశంలోనే మొదటి స్థానంలో ఎపి వున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా రైతులు, ప్రజలు ఆన్‌లైన్ ద్వారా భూముల వివరాలను చూసుకునే వీలు, ప్రింటు తీసుకునే వెసులుబాటు కల్పించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు మంత్రి చెప్పారు. రెవెన్యూశాఖను అభివృద్ధి పథంలో తీసుకురావటానికి అనేక సంస్కరణలు తీసుకువచ్చామని, ఇంకా ఆ శాఖలో అనేక మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. గురువారం ఓ హోటల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అధికారుల సర్వే సెటిల్‌మెంట్ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూశాఖ పటిష్టంగా ఉండాలంటే సర్వేశాఖ ప్రధాన భూమిక పోషించాల్సి వుందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులు భూములను ఖచ్చితంగా సర్వేచేసి, భూమి విస్తీర్ణాలను వారికి చూపించినప్పుడే వారికి మన శాఖ మీద నమ్మకం ఏర్పడుతుందన్నారు. సర్వే విభాగం ఆధునీకరణ కోసం రూ.800 కోట్లు సహాయంకై కేంద్రానికి ప్రతిపాదన పంపించడం జరిగిందన్నారు. జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటు కోసం కావలసిన భూమిని సకాలంలో సర్వేచేసి, ఆయా నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయటంలో సర్వే సెటిల్‌మెంట్ ప్రధాన పాత్ర వహిస్తుందని ఆయన అన్నారు.
అవినీతి’ ప్రచారం వాస్తవ దూరం
రెవెన్యూ శాఖ అవినీతిమయం అని మీడియాలో కొందరు అదేపనిగా ప్రచారం చేయటం తనకెంతో బాధాకరంగా ఉందని కెఇ కృష్ణమూర్తి మీడియా ఎదుటే ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో 42 శాతం అవినీతి అంటే 58 శాతం బాగున్నట్లే కదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఈ శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 76 లక్షల మంది పట్టాదారులున్నారు. వాస్తవానికి 60 ఏళ్లుగా భూముల రీసర్వే లేదన్నారు. అందుకే రీసర్వే చేయాలా లేక రీ సప్లిమెంటరీ సర్వే చేయాలా అని ఆలోచిస్తున్నామన్నారు.

చిత్రం.. కెఇ కృష్ణమూర్తి