ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో 21 ప్రభుత్వ బంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 28: రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో 21 కొత్త పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రతిపాదించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన ఇన్‌ఛార్జి మంత్రి సునీత ఇక్కడి 80 అడుగుల రహదారిలో పౌరసరఫరాల సంస్థ ద్వారా ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంకుకు శంకుస్థాపన చేశారు. సునీత మాట్లాడుతూ ఇప్పటి వరకూ రాష్ట్రంలో విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండు మాత్రమే పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో బంకులు నడుపుతున్నారన్నారు. రంజాన్ తోఫాలో పంపిణీ చేయగా మిగిలిన కిట్‌లను సంక్షేమ వసతి గృహాలకు అందించాలని నిర్ణయించామని, ఈ మేరకు కిట్‌లను వసతి గృహాల సంక్షేమ అధికారులకు అందజేసారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న నిత్యావసర వస్తువులకు నగదు బదిలీ పథకం విజయవంతం కావడంతో త్వరలో రాష్టవ్య్రాప్తంగా అమలు చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా నిత్యావసర వస్తువులకు 197 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించారన్నారు. వీటిపై ఈ నెల 31న చౌకధరల దుకాణాల డీలర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. మంత్రి కింజరాపుఅచ్చెన్నాయుడు మాట్లాడుతూ పౌరసరఫరాల సంస్థను ప్రజా ప్రయోజనార్థం వ్యాపార విధుల్లో పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సరసమైన ధరలకు ప్రజలకు సరకులను అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. హదూద్ తుపానుతో డీజిల్, పెట్రోల్ బాగా కొరత ఏర్పడిందని జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వమే స్వయంగా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు వచ్చిందన్నారు.