ఆంధ్రప్రదేశ్‌

‘మంచు’ ముసుగు తీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 23: ఉచిత విద్య అంటూ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పొందుతున్న శ్రీ విద్యానికేతన్‌లో రెడ్డి కులస్థులను కూడా కాపు కేటగిరిలో చూపి అనేక అక్రమాలకు పాల్పడినందునే రీయింబర్స్‌మెంట్ నిలుపుదల చేసినట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి కుటుంబరావు స్పష్టం చేశారు.
శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కుటుంబరావు మాట్లాడుతూ ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల్లో మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మనోజ్ వ్యాఖ్యలు ఆయన కుటుంబానికే వర్తిస్తాయన్నారు. గతేడాది ఫిబ్రవరి 5వ తేదీన ప్రభుత్వ కార్యదర్శి రావత్‌కు లేఖ ఇచ్చామని చెప్తున్నారు తప్ప ఫీజు రీ యింబర్స్‌మెంట్ ఎంత బాకీ ఉందో, ఎందుకు రావటంలేదో ప్రస్తావించ లేదన్నారు. మంచు మోహన్‌బాబుకు చెందిన ఆ కళాశాలలో రెడ్డి విద్యార్థులను సైతం కాపుల కింద పరిగణించటం వల్లే అర్హత కోల్పోయారని తెలిపారు. మోహన్ బాబు వ్యాఖ్యలతో ముసుగు తొలగిపోయి అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. తన ప్రశ్నలపై మోహన్‌బాబు ఎందుకు స్పందించరో ప్రజలకు అర్థమవుతోందన్నారు.
కళాశాలలో ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తున్న విషయం వాస్తవమో కాదో తేల్చాలన్నారు. ప్రతి ఏటా విద్యార్థుల నుంచి ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ పేరుతో రూ 15 వేలు వసూలు చేశారని ఆ కళాశాల విద్యార్థులే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారని చెప్పారు. మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ అనేది తేలిపోయిందన్నారు. కేవలం రాజకీయం కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసుకోవాలంటే నేరుగా రంగంలో దిగాలన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనే ఓ క్రిమినల్ గెలుపు కోసం మోహన్‌బాబు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కళాశాల వెలుపల ఉన్న షాపుల నుండి గుడ్‌విల్ పేరుతో డబ్బులు వసూలు చేసిన విషయం నిజం కాదా అని నిలదీశారు.
చంద్రగిరి నుంచి ఫోన్‌చేసి ఇక్కడ ఇంటి పన్ను కూడా కట్టారనే విషయాన్ని ఆ ప్రాంత సర్పంచ్‌లే ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నారైల నుండి కూడా డొనేషన్లు తీసుకుని లెక్క, పత్రం లేకుండా ఖర్చు చేస్తున్నారని, మోహన్ బాబు కళాశాలలో 5 లక్షలు పైగా డొనేషన్లు వసూలు చేస్తున్నారని సెలబ్రిటీ ముసుగులో విద్య పేరిట ఆయన చేస్తున్న అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వ్యక్తికి పద్మశ్రీ అవార్డు దక్కడం బాధాకరమన్నారు. కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై విద్యాశాఖ ద్వారా విచారణకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. మోహన్‌బాబు కుటుంబం జగన్ ఫ్యామిలీతో వియ్యం పొందిన తరువాతే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.