ఆంధ్రప్రదేశ్‌

‘తూర్పు’ వాకిట వారసుల పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 23: విలక్షణ రాజకీయాలకు ఆలంభనగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా రాజకీయ వాకిట వారసులు ప్రజా క్షేత్రంలో ఎన్నికల రంగ ప్రవేశం చేశారు. ఈ సారి ఎన్నికల బరిలో అత్యధిక సంఖ్యలో వారసులు నిలబడ్డారు. ఇటు పార్లమెంట్‌లోనూ, అటు అసెంబ్లీ ఎన్నికల బరిలో వారసులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు టీడీపీలో ఐదు చోట్ల, వైసీపీలో ఐదు చోట్లా, జనసేనలో ఒక చోట పోటీలో ఉన్నారు. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ హవా ఉంటే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అత్యధిక సీట్లు ఉంటాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి ఇపుడు తూర్పు గోదావరి జిల్లాపై ఉంది. జిల్లాలో 19 శాసన సభా స్థానాలు, మూడు లోక్‌సభా స్థానాలు కలిపి తెలుగుదేశం, వైఎస్సార్ సీపీల నుంచి వారసులు పోటీకి దిగారు.
పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజమహేంద్రవరం లోక్‌సభా స్థానంలో సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప, అమలాపురం లోక్‌సభా స్థానంలో దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసి బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ రాజకీయాలకు కొత్తయినప్పటికీ విద్యావంతులు కావడంతో నేరుగా పోటీలో దిగారు. మాగంటి రూప పార్లమెంట్ నియోజకవర్గానికి తెలుసున్న నాయకురాలే. రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ పోటీ చేస్తున్నారు. ప్రత్తిపాడులో మాజీ ఎమ్మెల్యే వరుపుల జోగిరాజు మనవడు డీసీసీబీ ఛైర్మన్ వరుపుల రాజా అసెంబ్లీ బరిలోకి దిగారు. తుని అసెంబ్లీ నుంచి మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు ఈ సారి కూడా బరిలో నిలిచారు.
ఇక వైఎస్సార్ సీపీ నుంచి కొత్తపేట మాజీ ఎమ్మెల్యే దివంగత చిర్ల సోమసుందరరెడ్డి కుమారుడు చిర్ల జగ్గిరెడ్డి రెండో సారి ఎన్నికల బరిలోకి దిగారు. పెద్దాపురం శాసన సభా నియోజకవర్గం నుంచి సిట్టింగ్ కాకినాడ ఎంపీ తోట నర్శింహం సతీమణి వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అమలాపురం లోక్‌సభా స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న చింతా అనురాధ కూడా తండ్రి వారసురాలిగానే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె తండ్రి చింతా కృష్ణమూర్తి 2009లో పీఆర్పీ అభ్యర్ధిగా అమలాపురం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీలో చేరి సమన్వయకర్తగా పనిచేశారు. ఈ కారణంగానే ఆమెకు లోక్‌సభా స్థానంలో పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరపున మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు కుమారుడు జక్కంపూడి రాజా ఈ సారి ఎన్నికల బరిలో నిలిచారు.
గత ఎన్నికల్లో జక్కంపూడి విజయలక్ష్మి పోటీచేయగా ఈసారి కుమారుడు జక్కంపూడి రాజాను పోటీలో నిలిపారు. వైఎస్సార్‌సీపీ నుంచి రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీసీ సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ మార్గాని నాగేశ్వరరావు కుమారుడు మార్గాని భరత్ పోటీ చేస్తున్నారు. ఈయనకు కూడా తండ్రి వారసత్వం నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జనసేన పార్టీ నుంచి కాకినాడ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ తనయుడు ముత్తా శశిధర్ పోటీ చేస్తున్నారు.