ఆంధ్రప్రదేశ్‌

న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(క్రైం), మార్చి 23: కుప్పం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం విజయవాడలోని సివిల్ కోర్టులకు వచ్చి, నాలుగో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేశారు. కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన తరఫున నామినేషన్ పత్రాలను శుక్రవారం టీడీపీ నేతలు అక్కడి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద దాఖలు చేశారు. అయితే అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారి వద్ద ప్రమాణం చేయాల్సి ఉన్నందున ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న చంద్రబాబు కుప్పం వెళ్లి ప్రమాణం చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో శనివారం విజయవాడలోని సివిల్ కోర్టుల ప్రాంగణానికి వచ్చిన ముఖ్యమంత్రి న్యాయమూర్తి ఎదుట నామినేషన్ దాఖలుకు సంబంధించిన ప్రమాణం చేశారు. చంద్రబాబు కోర్టుకు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ ముఖ్యనేతలు, న్యాయవాదులు తరలివచ్చారు. కోర్టుల వద్ద పోలీసులు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లతోపాటు ముందస్తు తనిఖీ చర్యలు చేపట్టారు.

చిత్రం.. ప్రమాణం చేసేందుకు విజయవాడ సిటీ సివిల్ కోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు