ఆంధ్రప్రదేశ్‌

ఇక హరిత విద్యుత్ స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: రాష్ట్రంలో ఈ నెల 29వ తేదీన వనం-మనంలో భాగంగా ఒక కోటి మొక్కలను నాటే కార్యక్రమంలో ఏపి విద్యుత్ శాఖ భాగస్వామ్యం అవుతోంది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ స్టేషన్లు, సబ్‌స్టేషన్లను హరిత విద్యుత్ స్టేషన్లుగా మార్చాలని నిర్ణయించింది. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అన్ని విద్యుత్ సంస్థల్లో ఒక లక్ష మొక్కలను నాటనున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్ సిబ్బంది, ఇంజనీర్లు ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ 29వ తేదీ శుక్రవారం కర్నూలులో జరిగే వనం-మనంలో పాల్గొంటారు.