ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర మంత్రులుగా రాణించిన తండ్రీ కొడుకులు, సోదరులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: దేశంలో అత్యున్నత చట్టసభ లోక్‌సభకు ఎన్నికై, ఆపై కీలకమైన కేంద్ర మంత్రి పదవులు చేపట్టడమంటేనే మహాగొప్ప విషయం. అలాంటిది ఒకే కుటుంబం నుంచి ఒకరి తర్వాత మరొకరు కేంద్ర మంత్రి పదవిని చేపట్టడం అంటే మాటలుకాదు. కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన కోట్ల విజయభాస్కరరెడ్డి ముందుగా రెండు దఫాలు ముఖ్యమంత్రి పదవి చేపట్టి తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన మరణానంతరం తనయుడు సూర్యప్రకాశరెడ్డి తిరిగి అదే స్థానం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రి కాగలిగారు. కాకినాడ నుంచి ఎన్నికైన ఎంఎస్ సంజీవరావు సుదీర్ఘకాలం కేంద్రంలో వివిధ శాఖలు నిర్వహించారు. ఆ తర్వాత తనయుడు పళ్లంరాజు తిరిగి అదే స్థానం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రి కాగలిగారు. రాజమండ్రి నుంచి ఎన్నికైన ఎస్‌బీపీ పట్ట్భారామారావు కేంద్రమంత్రి కాగా అనంతరం ఆయన సోదరుడు సత్యనారాయణరావు కూడా కొంతకాలం కేంద్రమంత్రిగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రి కాగలిగిన ఘనత పీవీ నరసింహరావుకు దక్కగా అంతకుముందు రాష్టప్రతి పీఠం అధిష్టించిన ఘనతను నీలం సంజీవరెడ్డి సొంతం చేసుకున్నారు.