ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో తెరాసకు పనేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి పనేమిటని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను రావణకాష్టంగా మార్చేందుకు బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు ఆదివారం కళా వెంకటరావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకన్నా మిన్నగా పాలన అందిస్తున్న చంద్రబాబును దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
31 కేసుల్లో దోషిగా ఉన్న జగన్‌కు మద్దతు ఇవ్వడం కృష్ణా, గోదావరి జలాలను హస్తగతం చేసుకోడానికి కాదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. నవ్యాంధ్రలో నౌకాశ్రయాలను దక్కించుకోవడం ద్వారా పరిశ్రమలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిపరుడైన జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఎందుకు తాపత్రయపడుతున్నారని నిలదీశారు. వైకాపాకు జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో గుజరాత్‌ను మించిపోతామని మోదీ, తెలంగాణను మించిపోతామని కేసీఆర్ కుట్ర చేయడం నిజంకాదా అని ఆరోపించారు. ఏపీలోని పోలీసులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రజలపై నమ్మకం లేదనే జగన్ తెరాసపై విశ్వాసం కనబరచడం వెనుక ఆంతర్యాన్ని వివరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న ప్రతిఒక్కరూ వైకాపాకు అనుకూలంగా వ్యవహరించాలని ప్రగతి భవన్ వేదికగా అల్టిమేటమ్ జారీ చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏపీపై విషం చిమ్ముతూ, జగన్‌పై ప్రేమచూపడం వెనుక రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థ తెచ్చే కుట్రలో భాగమని ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని కోరారు. టీడీపీపై బురద చల్లేందుకు సినీనటులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ఎదుటివాడు దెబ్బతినాలనుకోవడం దురాశ అని, హైదరాబాద్‌లో ఉండి కుట్రలు చేస్తున్నారని, ధైర్యం ఉంటే ఏపీలో ప్రత్యక్షంగా పోటీ చేయాలని కళా వెంకట్రావు సవాల్ విసిరారు.