ఆంధ్రప్రదేశ్‌

బీజేపీని ఓడించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 24: దేశ ప్రజలను అన్నివిధాలా మోసం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ స్పష్టం చేశారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏ విధంగానూ ఆదుకోని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడమే వామపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. ఇందుకోసం ఎన్నికల తరువాత ప్రతిపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని అయినా బీజేపీని గద్దెనెక్కకుండా చేస్తామన్నారు. ఈరోజు అన్ని పార్టీల లక్ష్యం కూడా ఇదేనన్నారు. దేశంలో ఆయా రాష్ట్రాలకు సంబందించి రాజకీయ సమీకరణలు మారుతుంటాయన్నారు. దానినిబట్టి తమ పార్టీ ప్రజలకు మేలుచేసే విధంగా ఉండే వాటితోనే పొత్తు పెట్టుకుంటుందన్నారు. జనసేన పార్టీతో తమ పొత్తు ఉంటుందన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్య పార్టీలన్నింటిని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. దేశంలో రైతులు అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి దేశ ప్రధాని మోదీ ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలు, కార్మికులు, రైతుల భవిష్యత్ నాశనమైందని, వామపక్షాల పోరాటాల ఫలితంగా చేసేదిలేక కేవలం రెండు వేలు మాత్రమే రైతులకు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం చేతులు దులుపుకొందన్నారు.రైతులకు ఇది సరిపోతుందా? అంటూ పేర్కొన్నారు. అన్నదాతకు చేసిన సహాయం ఇదేనా? అంటూ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవించని బీజేపీ ప్రభుత్వం గద్దె దిగేటంతవరకు పోరాడతామన్నారు. ప్రజలు చైతన్యంగా ఉన్నారని, బలమైన ప్రతిపక్షం వస్తుందని, అప్పుడు తాము పరోక్షంగా వాటికి మద్దతి ఇస్తామని, ఈవిధంగా బీజేపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామన్నారు.
విశాఖ జిల్లా అరకు ప్రాంతంలో జనసేన పార్టీ బాగుందని, అలాగే అభ్యర్ధి కిల్లో సురేంద్ర విజయం తథ్యమని ఆమె జోస్యం చెప్పారు. దేశంలో 23 లక్షల మంది ఆదివాసులను వెళ్లగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఇందులోభాగంగానే కోర్టు తీర్పు ఇచ్చిందని, వాదనలు సరిగ్గా లేకనే ఈవిధంగా జరిగిందన్నారు. ప్రభుత్వం తరపున సరైన న్యాయవాదిని నియమించని కారణంగానే ఆదివాసీలకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. అంటే బీజేపీ ప్రభుత్వం వీరందర్నీ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు చేస్తున్న కుట్రలో భాగమేనన్నారు. అందువల్ల తాము ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ ద్వారా వీరందర్ని ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు సిహెచ్.నర్సింగరావు, బి.గంగారామ్ పాల్గొన్నారు.
చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్