ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా పుష్కరాలు పవిత్రంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 28: కృష్ణా పుష్కరాలను పవిత్రంగా, ధర్మంగా, శాస్త్రోక్తంగా నిర్వహించాలని విశ్వగురు పీఠాధిపతి భగవాన్ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ పిలుపునిచ్చారు. పరమ పవిత్రమైన కృష్ణానది పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ నుండి గురుడు కన్యారాశిలో ప్రవేశించడంతో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని విశ్వంజీ మహరాజ్ తెలియజేశారు. కృష్ణానదీ సహ్యాద్రీలో పుట్టి అనేక నదులతో కలిసి మన రాష్ట్రంలోకి ప్రవేశించి హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుందన్నారు. ఈ పరమ పవిత్రమైన పుష్కరాలలో మన పితృదేవతల కోసం పుష్కరస్నానాలు చేస పితృకర్మలు చేసి తర్పణాలు వదలడం మన సంప్రదాయం, సంస్కృతి ఆచారంగా వస్తోందన్నారు. అలాగే ఈ ప్రపంచమంతటిని ఒక కుటుంబంగా భావన చేసి అనాథ జీవులకు కూడా తర్పణాలు వదలడం ఎంతో శుభకరమన్నారు. ప్రతి మనిషీ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలన్నారు. జటాయువు చేసిన సహాయానికి శ్రీరాముడు, జటాయువుకు కర్మకాండలు నిర్వహించి మానవాళికి మార్గదర్శకులు అయినారన్నారు. ఈ శుభతరుణంలో కృష్ణానదీ జలాల్లో కాస్మో ఎలక్ట్రిక్ మాగ్నటిక్ పవర్ ప్రవహిస్తూ ఉంటే ఎంతో శక్తివంతంగా ఉంటుందన్నారు. ఇటువంటి సమయంలో ప్రజలు కృష్ణానదీలో స్నానాలు ఆచరించడం వల్ల శరీరానికి ఆరోగ్యం కల్గి అనేక కార్మిక దోషాలు నివృత్తి అయి మనిషి శక్తివంతుడు అవుతాడని స్వామీజీ తెలిపారు. భారత జీవన స్రవంతిలో ప్రజలు పుష్కరాలలో పాల్గొనడం వల్ల ఆచారాలు, సంప్రదాయాలు, పవిత్రత మానవాళికి చేకూరే ఆధ్యాత్మిక సన్మార్గ జీవితానికి దోహదపడుతుందన్నారు. ఈ పరమ పవిత్రమైన కృష్ణా పుష్కరాలను గోదావరి పుష్కరాలను నిర్వహించిన గత అనుభవాలతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తుండడం అభినందనీయమన్నారు. ఈ పుష్కరాల వల్ల తెలుగు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తూ, పుష్కరాలు నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు.