ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ఓటర్లు 3.93 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,93,45,717గా రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ముగియడంతో తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. జనవరి 11 నాటికి ప్రకటించిన జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.69 కోట్లు. కానీ చేర్పులు, తొలగింపుల తరువాత ఏప్రిల్ 11న జరుగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 1,94,62,330 మంది పురుష ఓటర్లు, 1,98,79,421 మంది మహిళా ఓటర్లు, 3957 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉండగా, అతి తక్కువ మంది విజయనగరం జిల్లాలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను కూడా విడుదల చేసింది. జిల్లాల వారీగా వివరాలు పరిశీలిస్తే... ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి
*
జిల్లా పురుషులు మహిళలు ట్రాన్స్‌జెండర్లు మొత్తం
శ్రీకాకుళం 10,88,410 10,86,493 273 21,75,176
విజయనగరం 8,98,331 9,19,654 128 18,18,113
విశాఖ 17,75,630 18,02,631 197 35,78,458
తూర్పు గోదావరి 20,80,751 21,23,332 353 42,04,436
పశ్చిమ గోదావరి 15,81,496 16,36,610 301 32,18,407
కృష్ణా 17,49,058 18,02,588 292 35,51,938
గుంటూరు 19,42,760 20,31,269 462 39,74,491
ప్రకాశం 13,08,179 13,24,075 153 26,32,407
నెల్లూరు 11,73,052 12,18,784 374 23,92,210
కడప 10,87,117 11,17,547 300 22,04,964
కర్నూల్ 15,75,247 15,96,633 533 31,72,413
అనంతపురం 16,25,192 16,14,071 254 32,39,517
చిత్తూరు 15,77,116 16,05,734 337 31,83,187
మొత్తం 1,94,62,339 1,98,79,421 3957 3,93,45,717