ఆంధ్రప్రదేశ్‌

మాలో చీలిక అభూత కల్పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 25: రామలక్ష్మణుల్లా కలసి ఉండే పెద్దనాన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మా నాన్న రామ్మూర్తి నాయుడు మధ్య విభేదాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారం అభూతకల్పన అని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తమ మధ్య అగాథం సృష్టించ వద్దని సినీనటుడు నారా రోహిత్ స్పష్టం చేశారు. నారా కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. వంశ ప్రతిష్టను నిలిపేందుకు ఒకరు చాలని అందువల్లే తామంతా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం తమ కుటుంబంపై బురద చల్లితే సహించేదిలేదని హెచ్చరించారు. నారా కుటుంబం యావత్తు చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని, నాలుగు దశాబ్దాల క్రితమే సమాజ అభివృద్ధి కోసం మా ఆస్తులను పాఠశాలలు, పంచాయతీ భవనాలకు బదలాయించామని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధే తమకు ముఖ్యమన్నారు. నారా పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్ ఇమేజ్‌గా మార్చటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి అనిర్వచనీయమన్నారు. తమ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారనే వాదన నూరుపాళ్ల అవాస్తవం.. అసత్యమన్నారు. రేయింబవళ్లు శ్రమించి ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలను ఏ విధంగా చూసుకుంటున్నారో చంద్రబాబు తమను కూడా అదే విధంగా తమనూ చూస్తున్నారన్నారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయిపైనే చేయి చేసుకున్న చరిత్ర వైఎస్ జగన్ కుటుంబానికి ఉందన్నారు. తమకు పదవులు ముఖ్యంకాదని స్పష్టం చేశారు. అలాంటి నీచ చరిత్ర తమ కుటుంబానికి లేదన్నారు. కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగే జగన్‌కు బాంధవ్యాల విలువ ఏం తెలుసని నిలదీశారు. ప్రతి ఏటా తమతో సంక్రాంతి జరుపుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కుటుంబ పెద్దలా గడుపుతున్నారని తెలిపారు. తమకు అవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. తన తండ్రి అనారోగ్యంగా ఉన్నందున ఆయన ఇంటికే పరిమితమయ్యారని తెలిపారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక కుటుబం సభ్యులు, వ్యక్తిగత విషయాలపై అవాస్తవాలను చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. నారా కుటుంబంలో చీలికలు, మనస్పర్థలు తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందాలనుకోవటం దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు.