ఆంధ్రప్రదేశ్‌

భీమవరంలో పాల్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 25: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌కు సోమవారం చుక్కెదురయ్యింది. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం నామినేషన్ దాఖలుచేయడానికి సోమవారం వచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు పాల్‌ను రిటర్నింగ్ అధికారి మాలకొండయ్య అనుమతించలేదు. ఎన్నికల నియమావళి ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు గడువు. అయితే సాయంత్రం 4 గంటలకు పాల్ రావడంతో నామినేషను స్వీకరించబోమని ఆర్వో మాలకొండయ్య తేల్చి చెప్పేశారు. దీంతో ఆర్వో కార్యాలయం నుంచి పాల్ బయటకు వచ్చేశారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడిన పాల్ తన రాకతో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. భీమవరంలో అన్ని పార్టీల కన్న తనకున్న అభిమానులే ఎక్కువన్నారు. కెఎ పాల్‌ని చూసిన వారంతా సీఎం సీఎం అని నినాదాలు చేయడంతో ఉత్సాహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.