ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన నామినేషన్ల ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 25: సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఆఖరిరోజు కావడంతో పలువురు ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు అందరూ తమ నామినేషన్లను దాఖలు చేశారు. అందరూ ఒకేసారి వస్తుండడంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని అధికారులు సైతం తిప్పలు పడాల్సి వచ్చింది. నెల్లూరు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బీద మస్తాన్‌రావు, డమీ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. బీజేపీ తరపున సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు.
నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పలువురు దరఖాస్తు
సోమవారం నెల్లూరు పార్లమెంట్ స్థానానికి ఇండింపెండెంట్ అభ్యర్థిగా ఎస్‌కె ఖరీముల్లా, పబ్లికన్ పార్టీ తరఫున ఎస్‌కె మహబూబా, సీపీఐ తరఫున మల్లాం రమేష్, ఇండిపెండెంట్‌గా శ్యామ్‌డన్, సమాది సురేష్‌బాబు, అన్నమాచార్యుల ప్రభాకర్, నరసింహపురం ప్రసాద్ నెల్లూరు లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి శ్రీహరిరావు, దళిత బహుజన పార్టీ తరఫున లోకనందకుమార్, బీఎస్‌పీ తరఫున రాజ్‌కుమార్, శ్రీహరిరావు దరఖాస్తు చేసుకోగా, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సల్మాన్, తిరుపతయ్య, మునిరత్నం నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలావుండగా చిత్తూరు లోక్‌సభ స్థానానికి 12 మంది మంది, రాజంపేట ఎంపి స్థానానికి 23 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజక వర్గాలకు 287 మంది దాఖలు చేయగా అత్యధికంగా మదనపల్లికి 40 మంది నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పారు.
ఇదిలావుండగా ప్రకాశం జిల్లాలో నామినేషన్ల దాఖలుకు చివరిరోజున భారీగా అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. ఒంగోలు లోక్‌సభ స్థానానికి మాగుంటతోపాటు ఆయన సతీమణి గీతాలత నామినేషన్ వేశారు. బాపట్ల లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే డేవిడ్‌రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థులుగా శిద్దారాఘవరావు, శిద్దా లక్ష్మీపద్మావతి తరపున నామినేషన్లు దాఖలు చేశారు. బాపట్ల లోక్‌సభ స్థానానికి బీజేపీ తరుపున సిహెచ్ కిశోర్‌కుమార్, తెలుగుదేశంపార్టీ తరుపున శ్రీరాం మాల్యాద్రి, శ్రీరాం రవిశంకర్, కాంగ్రెస్‌పార్టీ తరుపున జెడీ శీలం, వైకాపా తరపున నందిగం సురేష్‌బాబు నామినేషన్లుదాఖలు చేశారు.
కుప్పంలో 10 మంది అభ్యర్థులు.. 20 నామినేషన్లు
కుప్పం: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 మంది అభ్యర్థులు 20 నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి ఓబులేషు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబునాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ చంద్రవౌళి, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ సురేష్‌బాబు, బీజేపీ నుంచి తులసీనాథ్, జనసేన నుంచి డాక్టర్ వెంకటరమణ, వీసీకే గణేష్, ప్రజాశాంతి నుంచి బాలకుమార్, స్వతంత్ర అభ్యర్థులుగా సూర్యకుమారి, సతీష్, పద్మజ మొత్తం 20 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు సోమవారంతో గడువు ముగియడంతో అభ్యర్థులు ఇక ప్రచారంపై దృష్టిపెట్టారు.
చిత్రం.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరా