ఆంధ్రప్రదేశ్‌

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 26: ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో ప్రారంభమయ్యింది. ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 22న పోలింగ్ జరిగింది. మొత్తం 46 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 1,92,137 ఓట్లు ఓట్లు పోలయ్యాయి. మంగళవారం ఉదయం స్ట్రాంగ్ రూంల నుండి బ్యాలెట్ బాక్సులను బయటకు తీసి, అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో తెరవడం ప్రారంభించారు. బ్యాలెట్ పత్రాలను 50 వంతున కట్టలు కట్టే ఇనీషియల్ కౌంటింగ్ ప్రారంభించగా అది రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. 46మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో భారీ బ్యాలెట్ పత్రం రూపుదిద్దుకుంది. దీనికితోడు 46 మంది అభ్యర్థులు, వారి ప్రతినిధులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడంతో కౌంటింగ్‌లో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల ఇనీషియల్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి మంగళవారం అర్థరాత్రి అవుతుందని భావిస్తున్నారు. అనంతరం ఈ కట్టల నుండి అభ్యర్థుల వారీ బ్యాలెట్ పత్రాలను వేరుచేసి, లెక్కించడం ప్రారంభించాల్సివుంది. ఈ లెక్కింపు మంగళవారం అర్థరాత్రి దాటాకగాని, బుధవారం ఉదయానికి గాని ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.