ఆంధ్రప్రదేశ్‌

కొత్తపల్లి గీత బీ- ఫారం తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు, అరకు సిట్టింగ్ ఎంపీ కొత్తపల్లి గీత నామినేషన్‌తో పాటు పార్టీ తరపున జతచేసిన బీ ఫారాన్ని విశాఖ లోక్‌సభ ఎన్నికల అధికారి తిరస్కరించారు. సాంకేతిక కారణాలతో ఆమెను స్వతంత్ర అభ్యర్థిగానే గుర్తిస్తున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకుని పలువురు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించిన గీత, తన నామినేషన్‌లోనే సాంకేతిక కారణాలను సరిచూసుకోలేకపోయారు. నామినేషన్లకు చివరి రోజు సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్‌తో పాటు జతచేసిన పార్టీ బీ ఫారంపై స్టాంప్ లేనందున నామినేషన్‌ను పార్టీ తరపున గుర్తించలేమని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. దీంతో ఆమెను స్వతంత్ర అభ్యర్థిగానే పరిగణిస్తూ పోటీలో నిలచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీనిపై తాను ఎన్నికల సంఘాన్ని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.