ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘువర్మ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 26: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాకలపాటి రఘువర్మ మంగళవారం ఎన్నికయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 8372 ఓట్లతో రఘువర్మ సమీప అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడుపై విజయం సాధించారు. తొలి నుంచీ వీరిద్దరి మధ్యే గట్టి పోటీ నెలకొంది. దీంతో లెక్కింపు మధ్యాహ్నం నుంచి ఉత్కంఠగా మారింది. మొత్తం ఓట్లు 19,593 కాగా, ఇందులో 17,293 పోలయ్యాయి. వీటిలో 550 ఓట్లు చెల్లుబాటు కాలేదు. తొలి నుంచీ రఘువర్మ ఆధిక్యతలోనే ఉన్నా మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోపోవడంతో రాత్రి ఏడు గంటలు దాటినంత వరకు ఉత్కంఠతో ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మ్యాజిక్ ఫిగర్ 8372కు చేరుకోవడంతో అధికారికంగా రఘువర్మ గెలుపును ప్రకటించారు. ప్రత్యర్థి గాదె శ్రీనివాసులనాయుడుకు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు చేరుకునేసరికి 5433ఓట్లు లభించాయి. రఘువర్మకు తొలుత 7657 ఓట్ల మెజార్టీతో ఆదిక్యత చూపారు. అయితే మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు 600 ఓట్లకు పైగానే తక్కువుగా ఉన్నందున మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇందులో అతి తక్కువుగా ఓట్లు వచ్చే వారి నుంచి లెక్కింపు చేయాల్సి వచ్చింది. ఈ విధంగా తొలుత వి.నీలంకు చెందిన చెందిన 34 ఓట్లు, ఆ తరువాత పాలవలస శ్రీనివాసరావుకు చెందిన 63 ఓట్లు, జె.బాలకృష్ణకు చెందిన 444 ఓట్ల లెక్కింపు జరిగింది. అయినా మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 310ఓట్లు తక్కువుగా ఉన్నందున ఎన్నికల సంఘం ఆదేశాలపై తదుపరి అడారి కిశోర్‌కుమార్‌కు చెందిన ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. దీంతో చివరకు రాత్రి ఏడు గంటలు దాటిన తరువాత 8372 ఓట్లతో రఘువర్మ గెలుపొందినట్టు ఎన్నికల అధికారి కలెక్టర్ కె.్భస్కర్ ప్రకటించారు.
చిత్రం.. విశాఖ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.్భస్కర్ నుంచి ధ్రువపత్రాన్ని అందుకుంటున్న రఘువర్మ