ఆంధ్రప్రదేశ్‌

జగన్, కేసీఆర్ మైత్రిపై నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 26: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసుంటే తప్పేంటని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, ఉద్యోగ సంఘాలు, పింఛన్‌దార్ల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నల్లబ్యాడ్జీలతో నిరసన నిర్వహించారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుని ప్రత్యేక హోదా సాధన కోసం సంఘీభావాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో చంద్రబాబుకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు పారిశ్రామిక సంఘాలు, పింఛన్‌దారులు, తటస్థులు, మేథావులు, ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. టీడీపీకి మద్దతుగా రాష్టమ్రంతటా ప్రచారం నిర్వహిస్తామన్నారు. జగన్ వ్యాఖ్యలకు నిరసన తెలియజేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు పిలుపునిచ్చారు.

చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసిన ఉద్యోగ సంఘాల నాయకులు