ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ అభ్యర్థులకు కేటీఆర్ బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 26: టీడీపీ అభ్యర్థులకు కేటీఆర్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, నామినేషన్ ఉపసంహరించుకోకుంటే హైదరాబాద్‌లో భూములు లాక్కుంటామని హెచ్చరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఆంధ్రాలో బలహీనమైన ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్టును ఆపేయవచ్చని, ముంపు మండలాలు వెనక్కి తీసుకోవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపన్నుతున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన జిల్లాలో సుడిగాలి పర్యటన చేసారు. ముందుగా పలాస నుంచి మందస వరకూ బైక్‌ర్యాలీ నిర్వహించారు. హరిపురం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అక్కడి నుంచి కొత్తూరు గేటు జంక్షన్, పొందూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. బందరు పోర్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఈ పోర్టులో తెలంగాణ వారికి ఉద్యోగాలు కల్పించాలని చూస్తున్నారని అన్నారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా ప్రతీఒక్కరూ గుర్తించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌తో కలిసిన జగన్‌ను వాళ్ళ కార్యకర్తలు నిలదీయాల్సి ఉందని, కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటే ఏమైందని జగన్ వ్యాఖ్యానించడాన్ని లోకేష్ తప్పు పట్టారు. అటువంటి వారికి నవ్యాంధ్రప్రదేశ్ పాలన కోసం అప్పగిస్తే బతుకులు నాశనమైపోతాయన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా రైతులకు రుణమాఫీ చేశామన్నారు. చంద్రబాబునాయుడు గెలిస్తే పింఛను మూడు వేల రూపాయలకు పెంచుతారన్నారు. 120 సంక్షేమ కార్యక్రమాలు బాబు అమలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం టీడీపీకి జోడెద్దుల వంటివన్నారు. మాయమాటలు చెప్పే జగన్‌ను గెలిపించుకుంటామా? అంటూ ప్రశ్నించారు. మోదీకి కేసీఆర్ సామంతురాజైతే, కేసీఆర్‌కు జగన్ సామంతురాజంటూ విమర్శించారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తూ, వైసీపీలో చేరాలంటూ హుకుం జారీ చేస్తున్న కేసీఆర్ చెప్పుచేతల్లో బతుకుతున్న జగన్‌కా నవ్యాంధ్రప్రదేశ్ అప్పగించేది అంటూ ప్రజలను లోకేష్ ప్రశ్నించారు. పసుపు - కుంకుమను అందించిన వ్యక్తిని గెలిపిద్దామా..పసుపు-కుంకుమ చెరిపేసిన వ్యక్తిని గెలిపిద్దామా..అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో మళ్ళీ బాబును ముఖ్యమంత్రి చేసి, టీడీపీని రథసారధులుగా మారాలంటూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రజలను, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వేయబోయే ఓటు నవ్యాంధ్రప్రదేశ్ బాగుకోసమన్న ఆలోచనతోనే వేయాలని రామ్మోహన్‌నాయుడు విజ్ఞప్తి చేసారు.

చిత్రం.. పలాసలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న లోకేష్, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు