ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తిరుగుబాటు తప్పదని పిసిసి అధ్యక్షుడు రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పునరుద్ఘాటించారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులు హోదా కోసం పార్లమెంటువైపు ఆశగా చూస్తున్నారన్నారు. శనివారం అనంతపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దురదృష్టం కొద్దీ రాష్ట్ర విభజన జరిగిందన్నారు. బాధ్యతగల ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయడం లేదన్నారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఎన్నికల సందర్భంగా 15 ఏళ్ల ప్రత్యేక హోదా సాధిస్తానన్న చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో నోరు మెదపడం లేదన్నారు. హోదా గురించి మాట్లాడితే కేసులో ఇరికిస్తారన్న భయంతో ప్రధాని మోదితో హోదా విషయం ప్రస్తావించడం లేదన్నారు. పైగా హోదాతో ఒరిగేదేమి లేదని, అదేమైనా సంజీవనా అంటూ మాట్లడుతున్నారని మండిపడ్డారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని హోదా గురించి మాట్లడకుండా మట్టి, నీళ్లు ఇచ్చి మోసం చేశారన్నారు. నాటి నుండి కాంగ్రెస్ పార్టీ హోదా కోసం పోరాటం సాగిస్తోందన్నారు. హోదా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లమంటే చంద్రబాబు దాని ఊసెత్తడం లేదన్నారు. రాష్ట్రం నుండి కాంగ్రెస్ తరఫున ఒక్క ఎంపి లేకపోయినా హోదా కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామన్నారు. రాజ్యసభలో కెవిపి ప్రవేశపెట్టిన బిల్లుపై రాష్ట్రానికి చెందిన టిడిపి, బిజెపి సభ్యులు సరిగా స్పందించడం లేదన్నారు. ఏడాది పాటు చర్చించి బిల్లు సభలో పెట్టిన తర్వాత ఓటింగ్‌కు వచ్చిన సందర్భంలో దానిని మనీబిల్లుగా పేర్కొనటం దుర్మార్గమన్నారు. వాళ్లు పాలకులా... పాలేరులా, ప్రభుత్వమా... ప్రైవేటు పాలన జరుగుతోందా అని రఘువీరా మండిపడ్డారు. టిడిపి, బిజెపి మినహా దేశంలోని అన్ని పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాయన్నారు. నాడు ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టిన వెంకయ్య నేడు బొంకులు బొంకుతున్నారన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా టిడిపి సభ్యులు హోదా గురించి ప్రస్తావించలేదన్నారు. సిఎం రమేష్ హోదా గురించి కాకుండా అసెంబ్లీ స్థానాలు పెంచాలని కోరడం సిగ్గుచేటన్నారు. టిడిపి, బిజెపిల మోసాలు ఎన్నో రోజులు సాగవన్నారు. 5న పార్లమెంటులో ఒత్తిడి తెచ్చి ఓటింగ్‌లో నెగ్గుతామని పేర్కొన్నారు.

చిత్రం..అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి