ఆంధ్రప్రదేశ్‌

విజయనగరంలో 74.18%

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 11: విజయనగరం జిల్లాలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ ఆంధ్రా-ఒడిశా వివాదాస్పద గ్రామాలైన కొఠియా ప్రజలకు చుక్కెదురైంది. వీరంతా ముందు ఒడిశాలో ఓటు వేసుకొని ఆంధ్రాలోని పోలింగ్ స్టేషన్‌కు రావడంతో అక్కడ పోలింగ్ అధికారి వారికి ఓటు వేసే అవకాశం లేదని స్పష్టం చేయడంతో వారంతా వెనుదిరిగారు. కొఠియాలో దాదాపు వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఆంధ్ర ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయడంతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గతంలో వారంతా ఆంధ్రా, ఒడిశా రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారే. ఈ విధంగా వారంతా ఈ దఫా ఆంధ్రా, ఒడిశాలో ఒకేసారి ఎన్నికలు రావడంతో ఈసారి ఒక్క రాష్ట్రానికే పరిమితమయ్యారు.
మొరాయించిన ఈవీఎంలు
జిల్లాలోని అనేకచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మెరకముడిదాం మండలం పిఎస్ 34 విశ్వనాథపురంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇవిఎం మొరాయించింది. అలాగే గుత్తిపల్లిలో మూడున్నర గంటల పాటు మొరాయించింది. గర్భాం పిఎస్ 25లో 83 ఓట్లు పోలయిన తరువాత అక్కడ ఈవీఎం మొరాయించడంతో దాదాపు గంటన్నర సేపు పోలింగ్ నిలిచిపోయింది. ఇక భోగాపురం మండలం సవరవిల్లిలో గంట సేపు ఈవీఎం మొరాయించింది. రామభద్రాపురం మండలం ఇట్లమామిడిపల్లి, పేరాపురం పోలింగ్ స్టేషన్లలో కూడా ఈవీఎంలు మొరాయించాయి.
ఇదిలా ఉండగా జియ్యమ్మవలస మండలం చిన కొదమలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ పోలీసులు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, అరకు పార్లమెంట్ పార్టీ ఇన్‌ఛార్జి పరీక్షిత్ రాజును గదిలో నిర్బంధించారు. ఆ తరువాత గొడవ సద్దుమణిగిన తరువాత ఆమెను విడిచిపెట్టారు. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో 90 శాతం పోలింగ్ లక్ష్యం పెట్టుకున్నప్పటికీ 74.18 శాతం పోలింగ్ జరిగింది. ప్రశాంతంగా పోలింగ్ జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.