ఆంధ్రప్రదేశ్‌

కడపలో పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 11: స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా కడప జిల్లాలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలుచోట్ల టీడీపీ, వైకాపా వర్గీయులు పరస్పరం దాడులకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 71.03 శాతం ఓట్లు పోలయ్యాయి. మైదుకూరు నియోజకవర్గం జాండ్లవరం, చిన్నయ్యగారిపల్లెలో ఈవీఎంలను టేబుల్ పైనుంచి కిందకు తోసేశారు. రాజంపేటలో కొల్లావారిపల్లెలో వైసీపీ నేత ఆకేపాటి అమరనాధరెడ్డి సోదరుడు వాహనాన్ని టీడీపీకి చెందిన గ్రామస్తులు ధ్వంసం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గం గూడెంచెరువుగ్రామంలో వైసీపీ కార్యకర్తపై తెలుగుదేశం వర్గీయులు దాడి చేశారు. దువ్వూరు మండలం మీర్జాన్‌పల్లెలో ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. జమ్మలమడుగు నియోజకవర్గాల్లో సమస్యాత్మక గ్రామాలు ఉండడంతో ఎస్పీ అభిషేక్ మహంతి పోలింగ్ ముగిసేంతవరకు జమ్మలమడుగు నియోజకవర్గంలోనే మకాం వేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డిని స్వగ్రామం రెడ్డివారిపల్లెలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పులివెందులలో పూర్తిగానూ, రాజంపేటలో, రాయచోటిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి పట్టు ఉన్న గ్రామాల్లో ఆ పార్టీ నేతలు సైక్లింగ్ చేశారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఉ.7 గంటలకే ప్రజలు ఓటువేసేందుకు బారులు తీరారు. పోలింగ్ సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడంతో ఈవీఎంలు పనిచేయలేదు. మాక్‌పోలింగ్ నిర్వహణ సమయంలోనే ఈవీఎంలు మొరాయించాయి. ఉదయం 9 గంటలైనా రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో మినహా తక్కిన చోట్ల పోలింగ్ 7 శాతానికి మించలేదు. ఆ తర్వాత పోలింగ్ పుంజుకుంది.