ఆంధ్రప్రదేశ్‌

కొత్త ఈవీఎంలకూ మాక్ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 11: రాష్ట్రంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన కొత్త ఈవీఎంలకు కూడా టీడీపీ ఏజెంట్ల ఒత్తిడి మేరకు మాక్ పోలింగ్ చేయించాకే పోలింగ్ ప్రారంభించారు. మొరాయించిన ఈవీఎంలకు చాలా చోట్ల మరమ్మతులు చేసి పని చేయించారు. కొన్ని చోట్ల కొత్త ఈవీఎంలను అమర్చారు.
అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తరువాత 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. అయితే మొరాయించిన ఈవీఎం స్థానంలో కొత్తవి అమర్చిన తరువాత, మాక్ పోలింగ్ నిర్వహించకుండా పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు కొంతమంది రిటర్నింగ్ అధికారులు ప్రయత్నించారు. అయితే దానిని టీడీపీ ఏజెంట్లు అడ్డుకుని, మళ్లీ మాక్ పోలింగ్ నిర్వహించాకే కొత్త ఈవీఎంలతో పోలింగ్‌లకు అనుమతించడం గమనార్హం.
టీడీపీకి వేస్తే.. వైకాపాకు...
కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం చౌటపల్లిలో రెండు పోలింగ్ బూత్‌ల్లో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే, వైకాపాకు వెళ్తోందంటూ కొంతమంది ఓటర్లు ఆందోళనకు దిగారు. దీంతో పోలింగ్‌ను నిలిపివేసి, కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసి పోలింగ్ కొనసాగించారు. విజయవాడలో జమ్మిచెట్టు సెంటర్ వద్ద కూడా టీడీపీకి వేస్తే, బీజేపీకి పడుతోందంటూ కొంతమంది ఓటర్లు ఆందోళన చేయడంతో పోలింగ్ నిలిపివేసి, కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించారు. అయితే దీనిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది కొట్టిపారేశారు. అది పుకారు మాత్రమేనని, అలా జరగదని స్పష్టం చేశారు.