ఆంధ్రప్రదేశ్‌

స్థానిక సంస్థల్లోనూ ఇదే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 12: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సార్వత్రిక ఎన్నికల స్ఫూర్తిని కొనసాగిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవిఎల్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని, పార్టీ గుర్తును క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో విజయవంతమయ్యామని, దీంతో పాటు తమ పార్టీ అనుబంధ సంస్థల నుండి కూడా పూర్తి సహకారం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా కర్నాటక పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే 6 పార్లమెంటు స్థానాలకు రాష్టస్థ్రాయి నాయకులు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయాలని కూడా నిర్ణయించామన్నారు. ఈనెల 14వ తేదీన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల్లో వేడుకలను నిర్వహించాలని కూడా ఆదేశించినట్టు కన్నా తెలిపారు. ప్రస్తుత ఎన్నికల నిర్వహణ తీరుపై కన్నా స్పందిస్తూ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ అనేక అరాచకాలకు పాల్పడిందని, ఎన్నికల కోడ్‌ను టీడీపీ అభ్యర్థులు ఉల్లంఘించారన్నారు. పోలింగ్ రోజున ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పలురకాలుగా కుయుక్తులు పన్ని విఫలమయ్యారన్నారు. విజ్ఞులైన ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని, ఈ ఎన్నికలతో రాష్ట్రంలో తెలుగుదేశం అరాచక పాలనకు చరమగీతం పాడటం ఖాయమన్నారు. అలాగే నర్సరావుపేట, విశాఖపట్నం పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తారని ధీమా వ్యక్తంచేశారు.