ఆంధ్రప్రదేశ్‌

ఈసీని నిలదీస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: రాష్ట్రంలో పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలు అప్పటికప్పుడు జరిగినవి కావని, పక్కా ప్రణాళికతో జరిగాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మొరాయించిన ఈవీఎంలకు మరమ్మతు చేశారో లేక ప్రోగ్రామ్‌లనే మార్చేశారో అని అనుమానం వ్యక్తం చేశారు. తాను వేసిన ఓటు టీడీపీకి పడిందో లేదో కూడా నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ కార్యాలయంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నికల జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసీని నిలదీసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. పోలింగ్ రోజును ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న చారిత్మ్రక రోజుగా అభివర్ణించారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు మామూలు ఎన్నికలు కావన్నారు. దేశాన్ని భ్రష్టుపట్టించిన నియంత మోదీ, రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్న కేసీఆర్, కరడుకట్టిన ఆర్థిక ఉగ్రవాది జగన్ కలిసి టీడీపీని లక్ష్యంగా చేసుకుంటే జరిగిన ఎన్నికలన్నారు. చిన్నా, పెద్ద అందరూ ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి ఓట్లేశారన్నారు. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ హైవేలో ట్రాఫిక్ జామ్‌లు ఉండేవని, కానీ ఓటు వేసేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చారన్నారు. పుణె నుంచి వచ్చి ఓటు కోసం గొడవ పడుతుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి జన్మభూమి కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వచ్చారన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఓటేయాలని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని స్థిర నిశ్చయంతో వచ్చారని గుర్తు చేశారు. బస్సులో సీట్లు లేకపోతే నిలబడి, బైకుల మీద, లారీల్లోనూ వచ్చారన్నారు. అయితే ప్రతిపక్షం, ఈసీ కలిసి ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారన్నారు. ఎంత హింసాత్మకం చేయాలో అంతా చేశారని మండిపడ్డారు. పోలింగ్‌లో కుట్ర చేశారని ఆరోపించారు. ఉదయానే్న ఓటేద్దామని పోలింగ్ కేంద్రాలకు వెళితే ఈవీఎంలు పని చేయలేదన్నారు. పోలింగ్ ప్రారంభమైన గంటలో 35 శాతం ఈవీఎంలు పని చేయలేదని, దాదాపు 4400 ఈవీఎంలు పని చేయలేదన్నారు. రెండు గంటల పాటు ఈవీఎంలు పని చేయని సందర్భంలో పోలింగ్ వాయిదా వేసే అవకాశం ఉన్నా, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇదంతా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందన్నారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు, ఏపీలో ఈవీఎంల మొరాయింపు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన లావాదేవీలు ముందే జరిగాయన్నారు. హింసను ప్రేరేపించనున్నారని ముందే ఎన్నికల సంఘానికి చెప్పినా, పట్టించుకోకుండా సీనియర్ అధికారులను మార్చేశారన్నారు. పోలింగ్‌కు 24 గంటల ముందు ఎస్పీని బదిలీ చేశారని, హత్య కేసు విచారణ చేస్తున్న మరో ఎస్పీని బదిలీ చేయడం ద్వారా నేరస్థులకు అండగా ఉంటామన్న సంకేతాలను పంపారని ఆరోపించారు. ఎన్నికల సంఘం తమ ఇష్టానుసారం వ్యవహరించిందన్నారు. ఈవీఎంలు పని చేయకపోవడంతో ఓటర్లు మూడుసార్లు వెనక్కి వెళ్లి వచ్చారన్నారు. ఏపీ సీఈవో కూడా ఓటు వేయలేకపోయారని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం సీఈవోనే ఓటు వేయలేక వెనక్కి వెళితే, సామాన్యుల సంగతేమిటని ప్రశ్నించారు.
ఈవీఎంలను మరమ్మతు చేశారో లేక ప్రోగ్రామ్ మార్చి ఏమార్చారో అన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలకు అర్థం కాని ఒక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన యంత్రంపై ప్రజాస్వామ్య భవిష్యత్తు వదిలిపెట్టారని మండిపడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ప్రారంభించి సాయంత్రం ఆరుకు ముగిస్తారా అని ప్రశ్నించారు. పుణె నుంచి వేల రూపాయలు ఖర్చు చేసుకుని వస్తే, ఓటు వేయకుండా వెళ్లిపోవాలా అని ఒక యువతి ప్రశ్నించిదంటే ఈసీ తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు. వేంకటేశ్వర స్వామి దగ్గర ఏడాదికోసారి క్యూలో నిలబడతామని, ఐదేళ్లకోసారి క్యూలో నిలబడలేమా అని ప్రజలు భావించారన్నారు. సీఎస్‌గా పుణేఠాను మార్చేశారని, జగన్ సహ నిందితుడిని సీఎస్‌గా నియమిస్తారా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం, తదితర జిల్లాల్లో గుండాల్ని దింపి అల్లకల్లోలం సృష్టించారన్నారు. ఇష్టానుసారం విధ్వంసం సృష్టించారన్నారు. ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని బీజేపీ బ్రాంచ్ ఆఫీసుగా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఆ ముగ్గురూ బరితెగించి, భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ముందుకు వచ్చిన అందరికీ శెల్యూట్ చేస్తున్నానన్నారు. ప్రజల దృఢ సంకల్పం ముందు ఏ దుష్టశక్తి పని చేయలేకపోయిందన్నారు. మన దేశానికి అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చిందని, ఇప్పుడు జనం అర్ధరాత్రి వరకూ క్యూలో నుంచుని ప్రజాస్వామాన్ని కాపాడుకున్నారని కితాబిచ్చారు. ఈవీఎంల సమస్య పెద్ద సమస్య కాదని ఒక అధికారి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలను మరమ్మతు ఎవరు చేశారు వారి వివరాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎన్నికల సంఘాన్ని తానింత వరకూ చూడలేదన్నారు. ప్రజలు సీఎస్‌ను కూడా నిలదీశారని, తాడేపల్లిలో మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ప్రారంభించారన్నారు. ఈవీఎంల వైఫల్యంపై కేంద్ర ఎన్నికల సంఘం గురించి జగన్ మాట్లాడరని, వారికి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించడమే ఇందుకు కారణమని మండిపడ్డారు. ప్రచారం కీలక దశకు చేరుకున్న సమయంలో మూడు రోజులు ఎవరైనా ప్రచారం చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చుని అరాచకాలకు పథకం వేశారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయన్నారు. తప్పుడు పనులు చేసి ప్రజల్లో కక్ష, కసి పెంచారే తప్ప ఏమీ చేయలేకపోయారన్నారు. ఎమ్మెల్యే పదవిని మార్కెట్లో సరుకులా మార్చేశారన్నారు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను కొనేశామని మాట్లాడుతున్నారంటే ఎంతకు తెగించారో అర్థం అవుతోందన్నారు. సంక్షోభ సమయంలో మహిళలు ప్రదర్శించిన ధైర్యాన్ని, సంయమనాన్ని అభినందిస్తున్నానన్నారు. ప్రజలు తిరుగుబాటు చేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. ఇక్కడితో దీనిని ముగించడం లేదని, ఈసీని నిలదీసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు వెల్లడించారు. 392 కంపెనీ భద్రతా బలగాలు కావాల్సి ఉండగా, 190 మాత్రమే పంపడం ద్వారా హింసను ప్రోత్సహించారన్నారు. గత సారి చివరి దశలో ఎన్నికలు నిర్వహించగా, ఈసారి మొదటి దశలో నిర్వహించారన్నారు. దీనికి హేతబద్ధత ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఎవరితోనైనా చర్చించారా అన్నారు. మోదీ చెప్పడం వల్ల చేశారని, తనను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా మొదటి దశలో చేర్చారన్నారు. ఈవీఎంల మరమ్మతుకు సరైన శిక్షణ ఇచ్చుకోలేకపోవడం వల్ల ప్రజలు, తాము బాధలు పడాలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ఏమైనా ఫరవాలేదని, వారికి మాత్రం రాజకీయంగా లబ్ధి జరగాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన వ్యవహారాలపై కూడా ఈసీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, కేంద్రం, ఇతర బీజేపీ రాష్ట్రాల్లో ఇంటెలిజెన్సు అధికారులు లేరా అని ప్రశ్నించారు. కేవలం ఏపీలోనే కనబడ్డారా అంటూ ధ్వజమెత్తారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. హైదరాబాద్‌లో ఉండే వ్యక్తి ఇక్కడ ఓటు వేయమని అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.