ఆంధ్రప్రదేశ్‌

ఈవీఎంలకు మూడంచెల భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాయుధులైన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కాపలా ఉంటారు. రెండో దశలో రాష్ట్ర ప్రత్యేక బలగాలు కాపలా ఉంటాయి. మూడో దశలో స్ట్రాంగ్ రూమ్‌లకు 100 మీటర్ల దూరంలో రాష్ట్ర పోలీసులు కాపలా ఉంటారు. ఈ భవనాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
ప్రధాన పార్టీల ఏజెంట్లు కూడా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలా ఉంటారు. 41 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అధికారులు చేశారు.
ఓట్ల లెక్కింపు మే 23న జరుగనుంది. దీనిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు వీలుగా వేయాల్సిన టేబుళ్లు, హాళ్ల వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రతిపాదనలు పంపారు. అసెంబ్లీ, లోక్‌సభకు వేర్వేరు టేబుళ్లతో, కలిపి ఒకే టేబుల్‌పై లెక్కించేందుకు వీలుగా రెండు రకాల ప్రతిపాదనలు పంపారు.
ఓటు హక్కు విలువ చాటి చెప్పారు
* రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది
ఎంతో ఓపికగా ఓటర్లు క్యూ లైన్లలో నుంచుని ఓటు హక్కు విలువను చాటి చెప్పారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది అభినందనలు తెలిపారు.
అందరికీ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. పోలింగ్ ప్రక్రియకు సహకరించిన వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, రాజకీయ పార్టీలకు, సెక్టార్ మేజిస్ట్రేట్లకు ఆయన శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకూ కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి, తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు.
రెండుచోట్ల రీపోలింగ్‌కు సిఫారసు
గుంటూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక మేరకు రెండు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు వెస్ట్ 244వ బూత్, నరసరావుపేట 94 వ బూత్‌లో రీపోలింగ్ కోసం సిఫారుసు చేసినట్లు తెలిపారు.