ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల నిర్వహణలో ఈసీ ఘోర వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, ఏప్రిల్ 12: 2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ ఘోర వైఫల్యం చెందిందని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ, వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రం నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషన్ తొలిసారి పూర్తిస్థాయిలో ఘోర వైఫల్యం చెందిందని అన్నారు. రాష్ట్రాన్ని , రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అణగదొక్కాలనే ఆలోచనతో ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఈవీఎంలలో 50 శాతం మాత్రమే పనిచేసేలా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. దాదాపు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈవీఎం యంత్రాలు మొరాయించడంతో ప్రజలు గంటల తరబడి మండు టెండలో నిలబడాల్సి రావడం బాధాకరమన్నారు. తెలంగాణ సహా బిజేపి పాలిత ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలే లేవన్నారు. మన రాష్ట్రంలో 50 శాతం ఈవిఎంలో పని చేయక పోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం అవుతోందన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు. ఇది చూస్తూంటే కేంద్ర కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పని చేస్తోందని అర్ధం అవుతోందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తేదీని ఖరారు చేసిన తరువాత రాష్ట్ర డిజిపి, చీఫ్ సెక్రటరి ఇంటెలిజెన్స్ లాంటి ఉన్నతాధికారులను బదిలీలు చేసిన దాఖలాలే లేవన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం, మోదీ నేతృత్వంలో జరుగుతుందని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదన్నారు. ఈవిఎంలు సరి చేయలేని వారు ప్రైవేటు సంస్ధలకి ఆ పనిని అప్పగించ వచ్చుకదాని సూటిగా ఎన్నికల కమిషన్‌ని ప్రశ్నించారు. అసలు అవి పని చేస్తున్నాయో లేదో, లేక ఆ కంపెనీకి చెందిన తయారీవే పని చేయడంలేదో తెలుసుకోవాల్సిన బాధ్యత కేంద్రం, ఎన్నికల కమిషన్‌పై లేదాని నిలదీశారు. బోగస్ ఓట్ల లిస్టును కూడా సరి చేయలేని దౌర్భాగ్య స్ధితిలో ఉండడం బాధాకరమన్నారు.
ఈ విషయాలపై త్వరలోనే కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషన్‌ని రాష్ట్ర మంత్రులు అందరం కలిసి ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఏడు కేసుల్లో ముద్దాయిగా ఉన్న సర్వేపల్లి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని బైండోవర్ కింద ప్రతి రోజు స్టేషన్‌కి వచ్చి సంతకం చేయమని చెప్పాల్సిన పోలీసులు కిమ్మనకుండా ఉండడం చూస్తూంటే వైసిపికి పోలీసు తొత్తులుగా మారిపోయినట్లు ఉందని అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు, కందుకూరులలోనే కాక పలు నియోజకవర్గాల్లో వైసిపి నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు.
అందుకు నిదర్శనం ఆత్మకూరు, కందుకూరు, మర్రిపాడులలో మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి 2 గంటలపాటు పలు పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్‌లకు పాల్పడి, టీడీపీ నాయకులు, బూత్ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడులకు పాల్పడడమేనన్నారు. రాష్ట్రంలోఈవిఎంలు పని చేయక పోయినా కూడా తిరిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కావాలనే పట్టుదలతో మహిళలు, వృద్ధులు రాత్రి 11 గంటల వరకు క్యూలైన్‌లో నిలబడి ఓటు వేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అలాగే జిల్లాలో రెండు లోక్‌సభ, పది అసెంబ్లీ స్ధానాలను కైవసం చేసుకోనున్నామని, రాష్ట్రంలో తిరిగి టీడీపీ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, లోక్‌సభ అభ్యర్ధి బీద మస్తాన్‌రావు, రూరల్ నియెజకవర్గ అభ్యర్ధి అబ్దుల్ అజీజ్ టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, తాళ్ళపాక అనూరాథ, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు, అమృల్లా, ఎ దయాకర్‌గౌడ్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.