ఆంధ్రప్రదేశ్‌

పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రాలివే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 14: రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం పరిశీలించింది. అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను శ్రీకాకుళం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరంలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో లెక్కిస్తారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం ఓట్లను శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరం పార్లమెంట్ స్థానం ఓట్లను శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరంలోని జేఎన్‌టీయూకే ఇంజనీరింగ్ కళాశాల, లెండీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో లెక్కిస్తారు. విశాఖపట్నం పార్లమెంట్ స్థానం ఓట్లను ఏయూ, విజయనగరంలోని ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో, అనకాపల్లి పార్లమెంట్ స్థానం ఓట్లను ఆంధ్ర యూనివర్శిటీలో, కాకినాడ పార్లమెంట్ స్థానం ఓట్లను జేఎన్‌టీయూలో, అమలాపురం పార్లమెంట్ స్థానం ఓట్లను కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, జేఎన్‌టీయూ, రంగరాయ వైద్య కళాశాల, జేఎన్‌టీయూ ఇండోర్ స్టేడియంలో లెక్కిస్తారు. రాజమండ్రి లోక్‌సభ స్థానం ఓట్లను కాకినాడలోని ఐడీయల్ ఇంజనీరింగ్ కళాశాల, జేఎన్‌టీయూ, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలల్లో లెక్కిస్తారు. నరసాపురం పార్లమెంట్ స్థానం ఓట్లను స్థానికంగా ఉన్న విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ డెంటల్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలో, ఏలూరు పార్లమెంట్ స్థానం ఓట్లను రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో, మచిలీపట్నం పార్లమెంట్ స్థానం ఓట్లను కృష్ణా యూనివర్శిటీలో లెక్కిస్తారు. విజయవాడ పార్లమెంట్ స్థానం ఓట్లను ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, ఎస్‌ఎన్ పాడు నియోజకవర్గాల ఓట్లను వల్లూరు మండలంలోని పేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భవనంలో, వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల ఓట్లను నాగార్జున విశ్వవిద్యాలయంలో లెక్కిస్తారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం ఓట్లను రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూప్ విద్యాసంస్థల ప్రాంగణంలో, నంద్యాల ఓట్లను రాయలసీమ విశ్వవిద్యాలయంలో, కర్నూలు పార్లమెంట్ స్థానం ఓట్లను పుల్లయ్య ఇంజనీరింగ్, రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాలల్లో, హిందూపురం పార్లమెంట్ స్థానం ఓట్లను శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ప్రాంగణంలో లెక్కిస్తారు. కడప పార్లమెంట్ స్థానం ఓట్లను కేఎల్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో, నెల్లూరు పార్లమెంట్ స్థానం ఓట్లను రైజ్ కృష్ణసాయి పాలిటెక్నిక్, డీకే ప్రభుత్వ కళాశాల, తిరుపతి పార్లమెంట్ స్థానం ఓట్లను నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్, పూతలపట్టులోని శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్, ఆర్‌కేఎం లా కళాశాలల్లో లెక్కిస్తారు. రాజంపేట పార్లమెంట్ స్థానం ఓట్లను కడపలోని కేఎల్‌ఎం ఇంజనీరింగ్, పూతలపట్టులోని శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలల్లో, చిత్తూరు పార్లమెంట్ స్థానం ఓట్లను శ్రీ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ భవనంలో, గుంటూరు పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపును ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, నరసరావుపేట పార్లమెంట్ స్థానం ఓట్లను నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది.