ఆంధ్రప్రదేశ్‌

15 నుంచి వర్జీనియా పొగాకు వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13: గోదావరి జిల్లాల్లో వర్జీనియా పొగాకు వేలం ప్రక్రియకు ఈ నెల 15వ తేదీ నుంచి మొదలు కానుంది. రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడులోని కేంద్ర పొగాకు వేలం కేంద్రం, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కేంద్ర పొగాకు వేలం కేంద్రంలోనూ వేలం ప్రక్రియ సాగనుంది.
గత ఏడాదితో పోల్చుకుంటే సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ వాతావరణ పరిస్థితుల కారణంగా నాణ్యత తగ్గిందని తెలుస్తోంది. ఈ ఏడాది ఫెతాయ్ తుపాను కారణంగా ఒక సారి రైతులు నారుమడులు కోల్పోయి చాలా చోట్ల రెండో సారి నాట్లు వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం వల్ల నాణ్యతా లోపం కన్పించింది. నల్లరేగడి వర్జీనియా సాగులో సుమారు 25 శాతం బ్రైట్, 50 శాతం మీడియం, మిగిలిన 25 శాతం లోగ్రేడ్ దిగుబడి వచ్చినట్టు తెలుస్తోంది.
తొర్రేడు పొగాకు వేలం కేంద్రం పరిధిలో ఈ ఏడాది 1496 హెక్టార్ల విస్తీర్ణంలో వర్జీనియా సాగు జరిగింది. గత ఏడాది 1330 హెక్టార్లలో సాగు చేశారు. గత ఏడాది అత్యధిక ధర కేజీ రూ.167లు లభించింది. సరాసరి ధర కేజీ రూ.124ల 84పైసలు లభించింది. అయితే ఈ ఏడాది ఆశాజనకమైన ధర విషయంలో రైతుల్లో గుబులు వ్యక్తమవుతోంది.
పొగాకు రైతులకు మరింత సరళమైన విధానాల్లో పేమెంట్లు ఇచ్చేందుకు పొగాకు బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు రైతులకు పొగాకు బిల్లులకు సుమారు పదిహేను రోజులు పట్టేది. బిల్లుల మొత్తాన్ని బ్యాంకులకు పంపించి బ్యాంకుల నుంచి ఆయా రైతులకు చెల్లించే విధంగా పొగాకు బోర్డు చర్యలు చేపట్టేది. ఈ ఏడాది నుంచి తొలి సారిగా ఈపేమెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రైతుల అకౌంట్లలోకే నేరుగా పొగాకు గొనుగోళ్లకు సంబంధించిన మొత్తం పడే విధంగా కొత్త విధానాన్ని చేపట్టారు. రైతులు తాము అమ్మిన పొగాకు బేళ్లకు సంబంధించిన మొత్తం ఏ రేటుకు అమ్మింది, ఎన్ని కేజీలు అమ్మిందీ, ఎంత మొత్తం వచ్చిందీ అనే అంశాలన్నీ ఎప్పటికపుడు రైతులకు నేరుగా మెసేజ్ అందుతుంది. పొగాకు బేళ్లు అమ్మిన కేవలం పదికొండో రోజు రైతుల అకౌంట్లలో ఈ పేమెంట్లు నేరుగా చెల్లింపులు జరుగుతాయి. ఆ విషయం వెంటనే రైతుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. రైతుల బ్యాంకు అకౌంట్లను, ఆధార నెంబర్లు, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేశారు. ఎటువంటి జాప్యం లేకుండా మధ్యవర్తి ప్రమేయం లేకుండా పొగాకు బోర్డు నుంచి నేరుగా రైతుల అకౌంట్లలోకే ఈపేమెంట్లు చేరుతాయి. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 15వ తేదీ నుంచి పొగాకు వేలం ప్రక్రియలో అధికారులు గ్రామాల వారీగా పొగాకు బేళ్లను వేలం కేంద్రానికి తరలించే విధంగా శ్రీకారం చుట్టారు. వాస్తవానికి 10వ తేదీ నుంచే వేలం ప్రక్రియ మొదలు కావాల్సి వుంది.
కానీ ఎన్నికల నేపధ్యంలో 15వ తేదీకి మార్చడంతో సోమవారం నుంచి వర్జీనియా పొగాకు వేలం ప్రారంభం కానుంది. గత ఏడాది సుమారు 40 రోజుల వరకు వేలం జరిగింది. ఈ ఏడాది బయ్యర్లు కూడా అధికంగా వేలం కేంద్రానికి వచ్చి కొత్త ప్రభుత్వం నేపధ్యంలో ఎగుమతి ఆర్డర్లను బట్టి ధరలు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.