ఆంధ్రప్రదేశ్‌

15 నుండి సముద్రంలో వేట నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 13 : ఈనెల 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశంలో తూర్పు తీరంలోని బంగాళాఖాతంలో చేపలవేట నిషేధంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేట నిషేధ ఉత్తర్వులు జీవో ఆర్‌టి నెంబరు 86 పశుసంవర్థక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్య్సశాఖ ద్వారా జీవోను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సముద్రంలో చేపలు, రొయ్యలు తమ సంతానోత్పత్తిని జరుపుకుంటాయి. ఈ సమయంలో వాటి సంపదను రక్షించే నేపధ్యంలో ప్రభుత్వం మెకనైజడ్, మోటరైజడ్ బోట్ల ద్వారా అన్నీ రకాల చేపలు, రొయ్యల వేటను నిషేధించింది. ఈ సమయంలో ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే 1994 సముద్ర వేట నియంత్రణ చట్టం కింద తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు బలరామమ్మూర్తి వెల్లడించారు. ఆ విధంగా వేట సాగిస్తే ఓట్లలో ఉన్న మత్స్య సంపదను స్వాధీనం చేసుకోవడంతో పాటు నాలుగు వేలు జరిమానా విధించడంతో పాటు డీజిల్, ఆయిల్ రాయితీలు కూడా నిలిపి వేస్తామన్నారు. అయితే వేట నిషేధం సాంప్రదాయ తెప్పలకు, నాన్ మోటరైజడ్ పడవలకు వర్తించదని ఆయన తెలిపారు. వేట నిషేధ కాలంలో జీవన భృతి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు వారి అర్హతను బట్టి కుటుంబానికి నాలుగు వేల రూపాయల చొప్పున వేట నిషేధ భృతిని చెల్లిస్తామన్నారు. వేట నిషేధాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్టల్ సెక్యూరిటీ, మెరైన్ పోలీసులతో గస్తీ నిర్వహిస్తారని తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లావ్యాప్తంగా 102 కిలోమీటర్ల మేర కోస్తాతీర ప్రాంతం విస్తరించి ఉండటంతో ఆ ప్రాంతంలో సుమారు 15 వేలమంది మత్స్యకారులు సముద్రంలో వేటను సాగిస్తూ జీవనం సాగిస్తుంటారు. జిల్లావ్యాప్తంగా మెకనైజడ్ బోట్లు సుమారు నాలుగు వేల వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు సముద్రంలో రణగొణధ్వనులతో తిరిగే మెకనైజడ్ బోట్లు మత్స్యకారులు వాటిని మరమ్మతుల నిమిత్తం సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. నిషేధ సమయంలో ఆ బోట్లకు మరమ్మతులు చేసుకోవడంతో పాటు వలలను కూడా ఆధునీకరించే పనిలో నిమగ్నం కానున్నారు. కాగా సాంప్రదాయ బోట్లతో వేట సాగించే వారికి జీవన భృతి దొరకనుంది. సముద్రంలో లోతట్టు ప్రాంతంలో చేపలు, రొయ్యలు గుడ్లను ఉత్పత్తి చేసి వాటి సంతానాన్ని బయటకు పంపించనున్నాయి. ఈ సమయంలో వేటసాగిస్తే తల్లి రొయ్యలు, చేపలు వలల్లో పడి సముద్రంలోని సంపద తగ్గిపోయే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, ఒంగోలు, టంగుటూరు, శింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోని మత్స్యకారులు వేట నిషేధ కాలంలో ప్రత్యామ్నాయ పనులు చేసుకునే పనిలో నిమగ్నం కానున్నారు. మొత్తం మీద ఈనెల 15వ తేది నుండి సముద్రంలో మెకనైజడ్ బోట్ల వేట నిషేధించడంతో సముద్రంలో వేట అలజడి పూర్తిగా తగ్గినట్లే అవుతుంది.