ఆంధ్రప్రదేశ్‌

పద్యం ద్వారా పరమార్థాన్ని చాటిచెప్పిన పోతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 13: పద్యం ద్వారా పరమార్థాన్ని చాటిచెప్పిన దిట్ట బమ్మెర పోతనామాత్యులు అని పలువురు వక్తలు అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాభాగవతాన్ని రచించిన బమ్మెర పోతన జయంత్యుత్సవాలు శనివారం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. తొలుత పోతన విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు మాట్లాడుతూ పోతనామాత్యుల రచనల్లో మధురభావాలు, భక్త్భివభరితమైన ధార్మికత ప్రతిబింబిస్తాయన్నారు. పోతన తన రచనల్లో నీతి, మానవీయమూలాలు, సాంస్కృతిక విలువలను అపూర్వంగా ప్రబోధించారన్నారు. పోతనామాత్యునిలోని అంతర్గత దివ్యగుణాలు రచనల్లో ప్రస్పుటమవుతాయన్నారు. పోతనామాత్యుని మహాభాగవతాన్ని చదివితే విద్యార్థులు, యువతలో వికాసం, సంస్కారభావాలు పెంపొందుతాయన్నారు. తన రచనలో సరళ వచన సహిత పద్యాలను కూడా పోతన ప్రతిబింబించారన్నారు. పోతన భాగవతాన్ని ప్రతి ఒక్కరూ చదవడం ఎంతో అవసరమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పోతన భాగవతాన్ని భర్తృహరి నీతి శతకం పేరుతో ముద్రించి పామరులకు సైతం అర్థమయ్యేలా రూపొందించిందన్నారు.
ఆకట్టుకున్న కవి సమ్మేళనం
బమ్మెర పోతన జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో సాయంత్రం నిర్వహించిన కవి సమ్మేళనం సభికులను ఆకట్టుకుంది. సమ్మేళనంలో పాల్గొన్న వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, సాహిత్యవేత్తలు పోతన వ్యక్తిత్వం, భాగవత విశిష్టత, పోతన భక్తిత్వం, జనప్రియ రామాయణం, రామాయణ కల్పవృక్షం అంశాలపై కూలంకషంగా ఉపన్యసించారు. పోతన ప్రతి పద్యంలో తాను చెప్పదలుచుకుంది సూటిగా చెప్పారన్నారు. పోతన రచించిన భాగవతం పురాణంగా ప్రసిద్ధి చెందిందన్నారు.
చిత్రాలు.. ఒంటిమిట్టలో పోతన విగ్రహానికి పూజలు చేస్తున్న కవులు, అర్చకులు
*కవి సమ్మేళనంలో ప్రసంగిస్తున్న కవులు