ఆంధ్రప్రదేశ్‌

పోలింగ్ తగ్గించేందుకు వైసీపీ పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 13: ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కు అయిన పౌరుల ఓట్లకు వైఎస్సార్ కాంగ్రెస్ తూట్లు పొడిచిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయటం ద్వారా పోలింగ్‌శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ పడరాని పాట్లు పడిందన్నారు. ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసే విధంగా బీజేపీ సహకారంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా హింసకు ఆజ్యం పోసిందని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో హింసతో ఓటింగ్ సరళిని నియంత్రించే దిశగా అల్లర్లను ప్రేరేపించిందని మండిపడ్డారు. ప్రజా చైతన్యంతో వైసీపీ పలాయనం చిత్తగించిందన్నారు. మహిళలు, వృద్ధులు, యువత బాధ్యతగా ఓటేశారని, గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడి ఎన్ని అవరోధాలు ఎదురైనా ఓటు హక్కును వినియోగించుకోవటం ప్రజాస్వామ్యానికి శుభ పరిణామమన్నారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోగా ప్రజల హక్కుకు భంగం కలుగుతున్నా, వైసీపీ నిలదీయకపోగా ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కాకపోయినా ఫర్వాలేదని, ప్రజలు ఇబ్బందులు పడినా తమకెందుకునే అహంభావం వైసీపీ నేతల్లో ఉందన్నారు. బాబు అప్రమత్తతగా వ్యవహరించటం వల్లే కుట్రలు పటాపంచలయ్యాయని తెలిపారు. బీజేపీ ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసినా, కేసీఆర్ బస్సులను అడ్డుకున్నా వైసీపీ ఏదోరకమైన హింస సృష్టించినా ప్రతి నియోజకవర్గంలో ఓటర్లు బాబును మరోసారి ఆశీర్వదించారన్నారు. వీవీ ప్యాట్ రసీదుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించి ఈసీ నిర్వాకంపై బీజేపీ దుర్మార్గాలను ఎండగడతామని స్పష్టం చేశారు.