ఆంధ్రప్రదేశ్‌

పాఠకులు, ప్రేక్షకుల ఆదరణే మనోబలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), ఏప్రిల్ 14: విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని అంకోసా ఆడిటోరియంలో గొల్లపూడి 80 ఏళ్ళ జన్మదిన వేడుకుల్ని అశేష సాహితీప్రియుల నడుమ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ జీ.రఘురామారావు సాహితీ మారుతీయం పేరిట గొల్లపూడి సాహితీ వైభవాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విలక్షణ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ తన సాహితీ జైత్రయాత్రలో ఎందరో కళా, సాహితీమూర్తుల సహచర్యం కలసొచ్చి తనను చిరస్మరణీయంగా నిలబెట్టిందన్నారు.
67 ఏళ్ళ అనుభవాలను రంగరించాల్సిన సందర్భం ఇదేనన్నారు. 14వ ఏటనే తాను తొలి కథను రాసానని, ఆకాశవాణిలో డిప్యూటీ డైరెక్టర్ హోదాకు చేరుకున్నానన్నారు. తన విజయం కన్నా ప్రేక్షకులు, పాఠకుల తృప్తి తనకు అమిత బలాన్నిచ్చిందన్నారు.
సంసారం ఒక చదరంగం అనే చిత్రంలో తన పాత్ర ఎందరినో ప్రభావితం చేసిందని, సహనటి అన్నపూర్ణ నటనాకౌశలంతో చిత్రం విజయవంతమైందన్నారు. తాను అనారోగ్యంతో చికిత్స పొందుతున్నానని, అటువంటిది పుట్టిన రోజు నిర్వహించే ఈ కార్యక్రమానికి సాహితీప్రముఖులు, సాహితీప్రియుల ప్రార్ధనాబలమే ఇక్కడు రాగలిగే శక్తినిచ్చిందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ కిల్లాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో సాహితీప్రముఖులు రచయిత, నటుడు రావి కొండలరావు, బీ.హర్షవర్ధన్, ద్విభాష్యం రాజేశ్వరరావు తదితరులు గొల్లపూడిని దుశ్శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ‘గొల్లపూడి అశీతిపర్వం’ పేరున ప్రత్యేక జన్మదిన సంచికను ఆవిష్కరించారు. గొల్లపూడి రచించిన వందేళ్ళ కథకు వందనాలు అంశంపై కె.రామచంద్రమూర్తి, తెరతీయగా రాధ అంశంపై డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, జీవనకాలం అంశంపై సినీ రచయిత డాక్టర్ వెనె్నలకంటి, మాట మారుతీ అంశంపై ద్విభాష్యం రాజేశ్వరరావు విశే్లషించారు. నవలా ‘ఋణం’ అంశంపై డాక్టర్ డీవీ సూర్యారావు, గొల్లపూడి మ్యూజింగ్స్‌పై గొలుసు ప్రభాకరశర్మ, అమ్మ కడుపు చల్లగా (గొల్లపూడి ఆత్మకథ) డాక్టర్ బాలశ్రీనివాసమూర్తి, సోదాహరణంగా వివరించారు.
చిత్రం... గొల్లపూడిని సత్కరిస్తున్న రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ కిల్లాడ సత్యనారాయణ తదితరులు