ఆంధ్రప్రదేశ్‌

శివధనుర్భంగ అలంకారంలో ఒంటిమిట్ట రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 18: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు శివధనుర్భంగాలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తిని శివధనుర్భంగాలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. శ్రీరామచంద్రుడు సీతమ్మ అమ్మవారిని పరిణయమాడినపుడు శివుడి ధనస్సును ఎక్కుపెట్టిన వైనాన్ని స్పరింపజేస్తూ ఒంటిమిట్టలో కోదండరాముడికి శివధనుర్భంగాలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామోత్సవం ముందుభాగంలో భక్తబృందాలు, చెక్క్భజనలు, కోలాటాలు అలరించాయి. భక్తులు అడుగడుగునా స్వామికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామోత్సవం అనంతరం స్నపన తిరుమంజనం సేవ సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులకు నిర్వహించడం జరిగింది. రాత్రి కల్యాణం అనంతరం గజవాహన సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.