ఆంధ్రప్రదేశ్‌

హజ్ యాత్రకు 500మంది మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ఏదైనా కారణంతో 2019 హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోలేకపోయిన 500 మంది మహిళలకు అవకాశం కల్పిస్తూ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మక్బూద్ అహ్మద్ ఖాన్ గురువారం సర్క్యూలర్ నెంబర్ 15 విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్‌ఎండీ తాజుద్దీన్ ఆరీఫ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఈ క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న మహిళల్ని డ్రా ద్వారా ఎంపిక చేస్తామన్నారు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి. మే 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే మహిళ మిషన్ రీడబుల్ పాస్‌పోర్ట్ కలిగి ఉండి, దాని చెల్లుబాటు 2020, జనవరి 31వ తేదీ వరకు ఉండాలి. 2019 హజ్ యాత్రకు ఎంపికైన వ్యక్తి తాలుకు బంధువులు (ఆ వ్యక్తి ఎవరికైతే మెహరంగా ఉపయోగపడతాడో అలాంటి మహిళలు) మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అవసరమైన పత్రాలు జతపరచి దరఖాస్తు ఆన్‌లైన్‌లో నింపాలి. పాస్‌పోర్ట్ కాపీ ఇతర డాక్యుమెంట్‌లలో మెహరంతో వారికున్న బంధుత్వాన్ని నిర్ధారించే అంశాలు సరిగా ఉండాలి. భారతదేశానికి చెందిన ముస్లిం మహిళా ఎవరైనా హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోవచ్చని రాజుద్దీన్ ఆరీఫ్ తెలిపారు.