ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల్లో పొరపాట్లకు ఆర్వోలను బాధ్యులను చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు ఆర్వోలను బాధ్యులను చేయవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. వెలగపూడి సచివాలయంలో ఆయన్ని అసోసియేషన్ ప్రతినిధి, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ పీ. బాబూరావు తదితరులు గురువారం కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో లోపాలకు ఆర్వోలను బాధ్యులు చేస్తూ నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. పోలింగ్ రోజు ఓట్లు గల్లంతయ్యాయన్న ఫిర్యాదు లేవని, ఒత్తిడి ఉన్నా బాగా పని చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఏర్పాట్లు సరిగా లేవని కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు. క్షేత్ర స్థాయిలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కింది స్థాయి సిబ్బందికి అనుభవం లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. వాటికి ఆర్వోలను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవద్దని కోరారు.