ఆంధ్రప్రదేశ్‌

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అన్ని శాఖలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశించారు. వెలగపూడి సచివాలయం ఐదో బ్లాకులో గురువారం జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వేసవిలో వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని ఉద్దానం ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు అవసరం మేరకు నీరు తాగకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీజనల్ వ్యాధులపై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నామని సమావేశంలో పాల్గొన్న పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి వెల్లడించారు. పంచాయతీల్లో దోమల నివారణకు నాణ్యమైన కీటక నాశనులను పిచికారీ చేయించాలని అధికారులను ఆదేశించారు. పిచికారీ పరికరాలను దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విశాఖ, విజయవాడ లాంటి పట్టణాల సమీప గ్రామాల్లో అపార్ట్‌మెంట్లు బాగా విస్తరిస్తున్నాయి, అలాంటి ప్రాంతాల్లో దోమల నివారణపై దృష్టి సారించాలని సూచించారు. క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేయాలని, మంచినీటి పైపులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. తాగునీటిలో ఈకొలీ బాక్టీరియా కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో 26 లక్షల దోమ తెరలు పంపిణీ చేశామని, వాటి వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. హాస్టల్ విద్యార్థులకు కూడా దోమ తెరలు పంపిణీపై ఆలోచన చేయాలని అధికారులను కోరారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రుల్లో దోమల నివారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సూచించారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, స్వైన్‌ఫ్లూ లాంటి వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్త పాటించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాధులతో చనిపోయిన పశువుల మాంసం తినడం వల్ల ప్రజలు ఆంత్రాక్స్ లాంటి రోగుల బారిన పడుతున్నారని గుర్తు చేశారు. చనిపోయిన పశువుల మాంసం తినడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేయాలని ఆమె సూచించారు.
చిత్రం...జెపిజి అధికారులతో సమీక్షిస్తున్న ఆరోగ్య, వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య