ఆంధ్రప్రదేశ్‌

హింస, అరాచకత్వానే్న నమ్ముకున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 18: ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి హింసను, అరాచకత్వాన్ని నమ్ముకుని వైకాపా అధినేత జగన్ రాష్ట్రంలో దాడులకు దిగుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ విమర్శించారు. గురువారం ప్రతిపక్ష నేత జగన్‌కు బహిరంగ లేఖ ద్వారా కళావెంకట్రావు పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో కరవును శాశ్వతంగా పారదోలేందుకు 13 జిల్లాల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే జగన్ తమ రాజకీయ లబ్ధికోసం అడ్డుకోవడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కానప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు కాబట్టి అక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిందే తప్ప లేకుంటే ఆపద్ధర్మ ప్రభుత్వం అయ్యేది కాదన్నారు. ఎన్నికల ముందు పలు రకాలుగా దుష్ప్రచారాలు, కుట్రలు, దౌర్జన్యాలు చేశారన్నారు. అయితే మోదీ నియంతృత్వాన్ని, కేసీఆర్ కుట్రలను ఓడించడానికి ప్రజలు చంద్రబాబు వైపు అండగా నిలిచారన్నారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడ్డారన్నారు. రాష్టవ్య్రాప్తంగా 4 వేలకు పైగా ఈవీఎంలు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడితే వైసీపీ నేతలు ఈసీ బ్రహ్మాడంగా పనిచేసిందని సర్ట్ఫికెట్ ఇచ్చారని, మీరేమైనా ఈసీకి ఏజెంట్లా అంటూ ప్రశ్నించారు. ప్రధానమంత్రి హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఐఎఎస్ అధికారి మహమ్మద్‌ను విధుల నుండి తొలగించడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన మైనార్టీ ఐఎఎస్ అధికారిని సస్పెండ్ చేయడం దుర్మార్గం కాదా అన్నారు. ఎన్నికలు 24 గంటల్లో జరగబోతుండగా టీడీపీ అభ్యర్థులు, బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయలేదా అని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ నేతల ఇళ్లపై ఎక్కడైనా దాడులు జరిగాయా అన్నారు. ఎవరెన్ని హింసలు, అరాచకాలకు పాల్పడిన మే 23న ప్రజలు ఇచ్చే తీర్పుతో తెలుగుదేశం మరలా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.